Saturday, May 18, 2024
- Advertisement -

జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉండవల్లి……

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆరు నెల‌ల పాటు ప్ర‌జాసంక‌ల్పం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందె. అయితె పాద‌యాత్ర‌పై అన్ని వ‌ర్గాలు, రాజ‌కీయ‌పార్టీలనుంచి అనేక విమ‌ర్శ‌లు, స‌ద్విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల‌ను భ‌హిస్క‌రించి జ‌నంలోకి వెల్తున్నారు. అయితె దీన్ని కొందురు స్వాగ‌తిస్తున్నా మ‌రికొందరు వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించేదానికి అసెంబ్లీనె వేదిక‌. అలాంటిది జ‌గ‌న్ వ‌దులుకోవ‌డం మంచిది కాద‌నె అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల‌నుంచి వ్య‌క్తం అవుతోంది.

అయితె ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీని బహిష్కరించాలన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని… వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైనే ఉందని ఆయన అన్నారు.

అయితె జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి ఆకాంక్షించారు. చట్టంలో లేదనే కారణం చూపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెలిపిందని… మరి, చట్టంలో ఉన్న పోలవరంపై కేంద్ర ఎందుకు అలసత్వం చూపుతోందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే, చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నా వృథానే అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -