Saturday, June 8, 2024
- Advertisement -

అన్నయ్య.. పెద్దమ్మల చెంతకు వరుణ్ గాంధీ..?!

- Advertisement -

ఒకే గూటి పక్షలు ఏనాటికైనా ఆ గూటికి చేరకతప్పదంటారు. ఇప్పుడు వరుణ్ గాంధీ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ముఖ్యనేతల్లో ఒకడిగా ఉన్న వరుణ్ కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నాడని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

గాంధీల కుటుంబానికే చెందిన ఈ రాజకీయ నేత  కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇందిరగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ – మేనకల తనయుడు వరుణ్. అయితే సంజయ్ మరణం తర్వాత కాంగ్రెస్ లో.. ఇందిర ఇంట్లో మనలేని మేనక బీజేపీ కి దగ్గరయ్యింది. భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసింది. గెలిచింది. తర్వాత వరుణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన కూడా యూపీ నుంచి వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన బీజేపీ లో పెద్ద నేతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని అంచలున్నాయి.
వీలైతే యూపీకి భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోవాలన్నది వరుణ్ గాంధీ ఆలోచన. అయితే బీజేపీ లో మాత్రం అది జరగనిచ్చేలా లేరు! అమిత్ షా వంటి వారు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో వరుణ్ కు అవకాశం లేకుండా పోతోంది. దీంతో బీజేపీని వీడటానికి వెనుకాడకూడదని వరుణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి అదే జరిగితే.. వరుణ్ అన్నయ్య, పెద్దమ్మల చెంతకు చేరే అవకాశాలే ఎక్కువ. మరి వీరి బంధం వీరందరినీ ఒక పార్టీలో మనగలిగేలా చేస్తుందా? వెయిట్అండ్ సీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -