Friday, May 17, 2024
- Advertisement -

గడువు దాటిందా అంతే సంగతులు

- Advertisement -

కొత్తగా వాహనం కొనుక్కున వారు గడువు దాటే వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా. ఇక మీ బండిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇంత వరకూ బండి కొన్నవారు తాత్కాలిక నెంబర్ తో బండి నడిపించేసే వారు. నిజానికి తాత్కాలిక నెంబరు వాహనం కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి.. ఇంటి నుంచి రవాణా శాఖకు వెళ్లడానికే ఉపయోగించాలి.

కాని వాహనదారులు మాత్రం నెలల తరబడి ఈ నెంబర్ తోనే వాహనాలు నడిపేస్తున్నారు. ఇక నుంచి ఆ పద్దతికి రవాణ శాఖ బ్రేకులు వేసింది. వాహనం కొన్న నెల రోజుల లోపు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉన్న నిబంధనను మరింత కఠినంగా అమలు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది.

వాహనం కొన్న వారంలోగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, నెల రోజుల లోపు మాత్రం ఐదు వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాలని నిబంధన విధించారు. ఒకవేళ ఎవరైనా నెల రోజులు దాటిన తర్వాత రవాణా శాఖ వద్దకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే మాత్రం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బండిని సీజ్ చేయడంతో పాటు సదరు వ్యక్తిపై కేసు కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. కొత్తగా వాహనం కొన్నవారూ.. తస్మాత్ జాగ్రత్త.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -