Thursday, April 25, 2024
- Advertisement -

క్యూబాపై ట్రంప్‌ సర్కారు ఉగ్రవాద ముద్ర..!

- Advertisement -

అధికారాన్ని బదిలీ చేసేందుకు వారం రోజులే సమయమున్న తరుణంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దేశంగా క్యూబాపై ట్రంప్‌ సర్కారు తిరిగి ముద్రవేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి సహాయం చేయడం, ముష్కరుల కోసం స్థావరాల ఏర్పాటు వంటి కారణాలతో క్యూబాపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు.

దేశంలోని ప్రజలను అణిచివేయడం, వెనిజువెలా సహా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం కోసం క్యూబా వనరులను వినియోగిస్తున్నట్లు పాంపియో ఆరోపించారు. క్యూబాపై మొదటి నుంచి దృష్టి సారించినట్లు తెలిపారు. గతంలో ఒబామా ప్రభుత్వం క్యూబాపై ఉగ్రవాద ముద్రను తొలగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -