Friday, May 17, 2024
- Advertisement -

హీరో విశాల్ నామినేష‌న్‌ను అంగీక‌రించిన ఎన్న‌కల రిట‌ర్నింగ్ అధికారి..

- Advertisement -

ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్విష్ట్ ల మీద ట్విష్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశాల్‌ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నాటకీయ పరిణామాల తర్వాత విశాల్‌ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన అధికారి ఆయన నామినేషన్‌ను అంగీకరించారు.

స‌రైన నిర్ణయం తీసుకున్నందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశాడు. ‘‘నా నామినేషన్‌ను ఈసీ అంగీకరించింది. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా’’ అని విశాల్‌ ప్రకటించాడు. తన మద్దతుదారులను బెదిరించారని.. అయినా చివరకు న్యాయం గెలిచిందని ఆయన చెప్పారు.

మొద‌ట ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు పోటీకి దిగుతూ సినీన‌టుడు విశాల్ వేసిన నామినేషన్‌లో వివ‌రాలు స‌రిగా లేవంటూ రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై అభ్యంత‌రం తెలుపుతూ ఆర్కేన‌గ‌ర్ లోని ఉప ఎన్నిక రిట‌ర్నింగ్ కార్యాల‌యం ఎదుట‌ సినీన‌టుడు విశాల్ ధ‌ర్నాకు దిగ‌డంతో అక్కడ హైడ్రామా కొన‌సాగింది.

ఉద్దేశ‌పూర్వ‌కంగానే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న విశాల్ ఆందోళ‌న నిర్వహించాడు. కాసేప‌టి త‌రువాత రిట‌ర్నింగ్ అధికారి విశాల్ వ‌ద్ద‌కు వ‌చ్చి వివ‌ర‌ణ కోరారు. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంత‌రం కొద్దిసేప‌టికే విశాల్‌ నామినేష‌న్‌ను రిటర్నింగ్ అధికారి అంగీక‌రించ‌డంతో వివాదం స‌ద్దు మ‌నిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -