Saturday, May 11, 2024
- Advertisement -

మహా శివునికి ఎన్ని పేర్లు, రూపాలు ఉన్నాయో తెలుసా..?

- Advertisement -

శివుడు అంటే కేవలం శివలింగం మాత్రమే అనకుంటారు భక్తులు. కానీ శివ పురాణం ప్రకారం మహాశివునికి 64 రూపాలు ఉన్నాయి. సామాన్యులకు ఈ 64 రూపాల గురించి తెలియవు. అయితే మహాశివుని 6 రూపాల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు.

మొదటిది లింగోద్భవ పరమశివుడు. ఈ ఆకారంలొ పై రెండు చేతులలొ ఒకదానితో లేడిని మరొక చేతితో గొడ్డలిని పట్టుకుని దర్శనమిస్తాడు. మిగిలిన రెండు చేతులు భక్తులను దీవిస్తూ ఉంటాయి. ఈ ప్రతిరూపాలు సాధారణంగా శివాలయాల పడమటి గోడలపై కనిపిస్తాయి. రెండవది నటరాజేశ్వరుడు. ఈ రూపంలో మహా శివుడు నాట్య రూపంలో దర్శనమిస్తాడు. లయకారుడు తాండవ నృత్యం చేసేటప్పుడు మెరుపులు మెరుస్తాయి, పెద్ద పెద్ద కెరటాలతో సముద్రాలు పోటెత్తుతాయి. అదే ఆనంద నృత్యం చేసినపుడు ఈ అనంత విశ్వం ప్రశాంతంగా ఉంటుంది.

ఇక మూడవది దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి అంటే.. సత్యానికి, జ్ఞానానికీ ప్రభువు. దక్షిణామూర్తి ప్రతిరూపం శివాలయాలలోని దక్షిణ గోడలపై కనిపిస్తుంది. ఇక నాల్గవ రూపం అర్దనారీశ్వర రూపం. అర్ధనారీశ్వర రూపంలో జీవ సృష్టికి నిదర్శనంగా శివపార్వతులు ఇద్దరు కలిసి దర్శనమిస్తారు. ఈ రుపంలో పార్వతీపరమేశ్వరులు… స్త్రీ, పురుషులు ఇరువురు సమానమని , ఎవరు ఎవరికన్నా గొప్పవారు కాదని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్నిస్తారు. ఇక ఐదవ రూపం గంగాధర రూపం. గంగాధర అంటే గంగను ధరించిన వాడని అర్ధం.

ఇక ఆరవ రూపం.. భిక్షాటన రూపం.. ఈ రూపం యొక్క ముఖ్య లక్ష్యం మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని నిర్మూలించడం. చతుర్భుజ సన్యాసిగా కనిపిస్తూ పరమశివుడు త్రిశూలం, ఢమరుకం, పుర్రెతొ ఉంటాడు. అలాగే కుడి చేతితో జింకకు ఆహారమిస్తూ కనిపిస్తాడు. ఇలాంటి పరమశివుని రూపాలు ఈ జగత్తులో మొత్తం 64 ఉన్నాయి.

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు ఇప్పుడు చూద్దాం.
పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్, హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్, ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి, కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్, తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ, మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్, శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -