Saturday, May 18, 2024
- Advertisement -

ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు చుర‌క‌లంటించి కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు

- Advertisement -
What’s Wrong YS Jagan meet PM Narendra Modi says Venkaiah Naidu

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీని క‌ల‌సిన‌ప్ప‌టినుంచి రాష్ట్రంలో రాజ‌కీ దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే.అయితే టీడీపీ మాత్రం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది.జ‌గ‌న్‌తోపాటు మిత్ర‌ప‌క్షం భాజాను టార్గెట్ చేషి విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర క‌మ‌ళ‌ద‌లంకూడా టీడీపీపై అంతేరీతిలో స్పందించింది.

భాజాపా రాష్ట్ర నాయ‌క‌త్వం విమ‌ర్శించ‌డం అంద‌రికీ తెలిసిందే. కానీ చంద్ర‌బాబుకు కేంద్రంలో అన్నీ తానై న‌డ‌పిస్తున్న సెంట్ర‌ల్ మంత్రి వెంక‌య్య‌నాయుడుకూడా ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు చుర‌క‌లంటించాడు.ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ మోదీని క‌ల‌వ‌డంతో త‌ప్పేంట‌ని టీడీపీని ప్ర‌శ్నించారు.ఈవిష‌యంలో కొంద‌రు ఎందుకు త‌ర్జ‌నా బ‌ర్జ‌నా ప‌డుతున్నారో అర్థం కావ‌డంలేద‌ని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ప‌రిప‌క్వ‌త‌లేని కొందురు దీనిపై రాద్దాంతం ఎందుకు చేస్తున్నారోన‌ని వెంకయ్య ఎద్దేవా చేసారు. రాష్ట్రపతి ఎన్నికలో ఏ పార్టీ తమకు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో పొత్తు గురించి మాట్లాడుతూ, ఇప్పటికైతే పొత్తుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అప్పుడు ఆలోచిస్తామని చెప్పటం సర్వత్రా అనుమానాలకు దారితీసింది.దీన్ని బ‌ట్టి చూస్తె ప‌రోక్షంగా వైసీపీతో 2019 ఎన్నిక‌ల్లో పొత్తుకు సిద్ద‌మ‌నే సంకేతాలు ఇచ్చారంటున్నారు రాకీయ వ‌ర్గాలు.

{loadmodule mod_custom,Side Ad 2}

మొన్నటి వరకూ టిడిపి-భాజపాలు కలిసే ఉంటాయని చెప్పే వెంక‌య్య … రాష్ట్రంలో క్షేత్రస్ధాయిలో ఎదగటానికి కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పారు. వెంకయ్య-చంద్రబాబులు కలిసున్నంత వరకూ భాజపా ఎదగదని స్ధానిక భాజపా నేతలే ఎన్నోసార్లు కేంద్ర నాయకత్వానికి నివేదికలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో క్షేత్రస్ధాయిలో బలపడతాం, 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అప్పుడే ఆలోచిస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.దీన్ని బ‌ట్టి చూస్తె వెంక‌య్య‌నాయుడుకూడా బాబుకు హ్యాండ్ ఇచ్చిన‌ట్టేన‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -