Sunday, May 12, 2024
- Advertisement -

బాబుకు మొద‌లైన క‌ష్టాలు…

- Advertisement -
Bad time starts to AP CM Nara Chandrababu Babu

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితుల‌కు ఎదురు తిరుగుత‌న్నాయి.ఇన్నాల్లు అడ్డూ లేకుండా ఏక‌చ‌క్రాధిప‌త్యంగా పాల‌న సాగించిన బాబుకు ఇప్పుడు బ్యాడ్‌టైం స్టార్ అయ్యింద‌నే చెప్పాలి.ప్ర‌స్తుతం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు బాబుకు కంటిమీద కునుకు లేకండా చేస్తున్నాయి.

జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీని క‌ల‌సి న‌ప్ప‌టినుంచి బాబ‌కు మ‌రిన్ని క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.ప్ర‌తి ప‌క్షాల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా త‌ట్టుకోవ‌చ్చు కాని మిత్ర ప‌క్షం భాజాపా నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తుంటె బాబుకు ఏంచేయాలొ తిలియ‌కు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు.
ముఖ్యంగా చంద్ర‌బాబ‌కు త‌న కొడుకు ఐటీ మంత్రిలోకేష్‌తోనే సమ‌స్య‌లు మొద‌య్యాయి.మంత్రిగా ప్ర‌మాణ స్వీకార చేసిన లోకేష్ త‌ర్వాత ప‌లు బ‌హిరంగ స‌భ‌ల‌ల్లో ఆనాలోచితంగా మాట్లాడి బాబు ప‌రువుతోపాటు…పార్టీ ప‌రువును బ‌జారుకీడ్చారు.ఒక‌సారికాదు ఏకంగా ఏడు సార్లు త‌ప్పుగామాట్లాడి సోషియ‌ల్ మీడియాకి చిక్కారు.దీంతో సోషియ‌ల్ మీడియా లోకేష్‌ను ఏరేంజ్‌లో అడుకుందో అందిరికి తెలిసిందే.ఇక ప్ర‌తి ప‌క్షాల‌కు అయితే లోకేష్‌ను,పార్టీని,బాబును విమ‌ర్శ‌ల‌తో ఉతికి ఆరేశారు.
చంద్ర‌బాబు నాయ‌డు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు వైసీపీ అధినేత ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌డం రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఊపు ఊపింది.మోదీ అపాయంట్ మెంట్ ఇచ్చిదికూడా బాబుకు స‌పోర్ట్‌గా ఉండే వెంక‌య్య‌నాయుడు లేని సంయంలో …క‌నీసం ఎవ్వ‌రికీ తెలియ‌కుండా ఇవ్వ‌డంతో ఇప్పుడు చ్చ‌నీయాశంగా మారింది.అయితే వీరి భేటీపై టీడీపీ త‌మ్ముళ్లు చేసిన చౌక‌బారు విమ‌ర్శ‌లే ఇప్పుడు బాబు కొంప‌ముంచాయి.జ‌గ‌న్ ఆర్థినేర‌స్తుడ‌ని ఆయ‌న‌కు అపాయంట్ మెంట్ ఎలా ఇస్తార‌ని విమ‌ర్శించి త‌మ స్థాయి తామె దిగ‌దార్చుకున్నారు టీడీపీ త‌మ్ముళ్లు.
మోదీతో జ‌గ‌న్ భేటీపై టీడీపీ చేసిన విమ‌ర్శ‌ల‌ను మిత్ర‌ప‌క్ష‌మైన భాజాపా ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.అధిస్టానం ద‌గ్గ‌ర నుంచి …రాష్ట్ర‌స్థాయి క్యాడ‌ర్ మొత్తం టీడీపీ ని ఏకి పారేసింది.మిత్ర‌ప‌క్షం అనిచూడ‌కుండా మూకుమ్ముడి దాడి మొద‌లు పెట్టారు.ప్ర‌తిప‌క్షాల‌ను అయితే విమ‌ర్శించ‌వ‌చ్చు…. ఇప్పుడు ఏంచేయాలో తెలియ‌కు బాబుతో పాటు ప‌చ్చ‌త‌మ్ముల్లు జుట్టు పీక్కుంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

2014లో బ్యాంకులతప్పుడు పత్రాలతో బ్యాంకు నుంచి 450 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో శుక్రవారం వాకాటి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ మెరుపుదాడులు నిర్వహించింది. ఏకకాలంలో నెల్లూరు – బెంగళూరు – హైదరాబాద్ లోని ఆఫీసులో సోదాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సస్పెండ్ చేశారు. ఇది బాబ‌కు పెద్ద ఎదురు దెబ్బే.
ఇన్నాళ్లు బాబుకు స‌పోర్ట్ చేసిన భాజాపా ఇక‌నుంచి బాబుకు చుక్క‌లు చూపించ‌డం కాయంగా క‌నిపిస్తోంది.2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని చెబుతున్న భాజాపా ప‌రిస్థితులు అనుకూలించ‌పోతే వైసీపీతో క‌ల‌సి పోటీచేసేందుకు సిద్దంగా ఉంది. ఇప్ప‌టికే దానికి సంబంధించి సంకేతాలు ఇచ్చింది క‌మ‌ల‌ద‌ళం. రాష్ట్రంలో బాబుకు ప్ర‌జ‌ల‌ల్లో గ్రాప్ ప‌డిపోవ‌డం…అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో అధిస్టానం జ‌గ‌న్ వైపు అడుగులు వేస్తోంద‌నే చెప్పాలి.

{loadmodule mod_custom,Side Ad 2}

మొన్న విశాఖపట్నంలో ఓ 24 ఏళ్ల కుర్రాడు హవాలా మార్గం ద్వారా 1500 కోట్ల రూపాయల స్కామ్ చేసేశాడు.. కాలేజ్ కు వెళ్లాల్సిన వయసులోనే దేశమే ఆశ్చర్యపోయేలా హవాలా మార్గం బాట పట్టేశాడు.. ఐటీ, ఈడీ, నిఘా వంటి వర్గాల కళ్లుకప్పి విజయవంతంగా 1500 కోట్లు దేశం దాటించేశాడు..ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.దీనిలో అధికార పార్టీనేత‌లు అండ‌దండ‌ల‌తోనే ఇదంతా జ‌రిగింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నాయి.
ఒకే సారి ఇన్ని స‌మ‌స్య‌లు బాబును చుట్టు ముట్ట‌డంతో ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది.ఏ చిన్న స‌మ‌స్య‌వ‌చ్చినా వెంక‌య్య‌నాయుడిని వెంట‌బెట్టుకొని ఢిల్లీ వెల్లి ప‌నులు చ‌క్క‌బెట్టుకొనే వారు.కాని ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు.ఎందుకంటే కేంద్రం ఇప్పుడు బాబ‌పై తీవ్ర అస‌హ‌నంతో ఉంది.ఇన్నాల్లు ఎదురులేద‌నుకున్న బాబుకు ఇప్ప‌టి నుంచి క‌ష్టాల క‌డ‌లేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -