Friday, April 19, 2024
- Advertisement -

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కి ఎట్టకేలకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి..!

- Advertisement -

కొవిడ్‌ నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా దిగుమతి, పంపిణీకి మార్గం సుగమమైంది. అలాగే పేద దేశాలు సైతం దీన్ని త్వరలోనే అందిపుచ్చుకునేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఐరోపా, ఉత్తర అమెరికాలో దేశాల్లో ఈ టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే, ఆయా దేశాల్లో ఉండే ప్రత్యేక నియంత్రణా సంస్థలు సైతం ఈ టీకాకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, ఆరోగ్య వ్యవస్థలు అంత బలంగా లేని పేద దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదమే కీలకంగా మారనుంది. తాము ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించడం ద్వారా ప్రపంచ దేశాలు తమ వ్యాక్సిన్‌ డోసుల కొనుగోలు, పంపిణీని వేగవంతం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. బ్రిటన్‌, అమెరికా సహా మరో డజనకు పైగా దేశాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ వ్యాక్సిన్‌ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తమ సమీక్షలో తేలిందని స్పష్టం చేసింది.

గుడ్ న్యూస్ చెప్పిన మోదీ.. స్వదేశీ టీకా వచ్చేస్తుంది..!

ఇక పై పిల్లలికి ఆ రెండు తినుబండారాలు బంద్..!

ఇది విన్నారా.. సినోఫార్మ్ కి షరతులు..!

వీసా ఆంక్షలు.. అందరికీ ట్రంప్ షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -