Sunday, May 19, 2024
- Advertisement -

జగన్, రామోజీలు కుమ్మక్కయ్యారని విమర్శించలేదేం..!

- Advertisement -

తెలుగుదేశం వాళ్లు మరోసారి జగన్ పై విరుచుకుపడ్డారు. కాస్త లేటుగానే అయినా కల్వకుంట్ల కవిత వెళ్లి జగన్ తో సమావేశం కావడంపై తెలుగుదేశం నేతలు స్పందించారు. కవిత వెళ్లి జగన్ ను కలవడం దారుణం అని… జగన్ , కేసీఆర్ ల మధ్య కుమ్మక్కుకు ఇదే రుజువు అని వారు అంటున్నారు.

తెలుగుదేశం నేత, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విమర్శ చేశాడు. జగన్ , కేసీఆర్ లు ఆడుతున్న నాటకంలో భాగంగానే కవిత వెళ్లి జగన్ ను కలిసిందని అచ్చెన్నాయుడు అన్నాడు. మరి ఇంత వరకూ బాగానే ఉంది. జగన్ , కవితల సమావేశం గురించి తెలుగుదేశం పార్టీ తనదైన రీతిలో స్పందించింది.

అయితే ఈ పార్టీ జగన్ ఎవరితో సమావేశం అయినా.. జగన్ తో ఎవరు సమావేశం అయినా… ఇలాగే స్పందిస్తుంది. అయితే మధ్యలో రామోజీ రావుతో జగన్ సమావేశం విషయంలో తప్ప! రామోజీతో జగన్ సమావేశంగురించి తెలుగుదేశం నేతలు ఎవ్వరూ ఘాటుగా స్పందించలేదు. జగన్ రామోజీల సమావేశం అనంతరం… టీవీ షోల్లో జూపూడీ వంటి వాళ్లు తలాతోక లేకుండా మాట్లాడటం పక్కన పెడితే.. అచ్చెన్నాయుడి తరహా రియాక్షన్ ఎక్కడ కనిపించలేదు. 

జగన్ , రామోజీలు కుమ్మక్కయ్యారని.. అందుకే వారి సమావేశం జరిగిందని తెలుగుదేశం నేతలు ఎవరూ ప్రకటించలేదు. కేసీఆర్ కూతురు వెళ్లి జగన్ తో కలిస్తే.. విమర్శించినంత ఈజీగా రామోజీ విషయంలో తెలుగుదేశం వాళ్లు స్పందించలేదు. అసలు వారి నుంచి అలాంటి స్పందన ఆశించడం కూడా వృథానే. అంతే కాదు.. కేసీఆర్, రామోజీల సమావేశం జరిగినప్పుడు కూడా చంద్రబాబు పార్టీ మౌనాన్నే ఆశ్రయించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. మరి ఇదెలా ఉందంటే.. జగన్ తో కేసీఆర్ సంబంధీకులు సమావేశం అయితే కుమ్మక్కు… అదే కేసీఆర్ వెళ్లి రామోజీని కలిసినా, రామోజీతో జగన్ వెళ్లి సమావేశం అయినా.. అది తప్పు కాదు. ఇదీ తెలుగుదేశం లెక్క. అందరూ అర్థం చేసుకోవాలి మరి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -