Sunday, May 5, 2024
- Advertisement -

ప్ర‌ధాని మోదీతో జ‌గ‌న్ భేటీ కావ‌డంతో రాష్ట్రంలో వేడెక్కిన రాజ‌కీయాలు..

- Advertisement -
Tensition in TDP on YSRCP President YS Jagan meet PM Narendra Modi

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఎవ‌రూ ఊహింత‌చ‌నంత‌ శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు త‌జాగా వైసీపీ అధినేత ప్ర‌ధాని మోదీతో బేటీ కావ‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భాజాపా మిత్ర ప‌క్ష‌మైన టీడీపీకి ఇది మింగుడు ప‌డ‌టంలేదు. తెలుగుదేశం పార్టీకి బ‌ద్ధ శ‌త్రువైన జ‌గ‌న్ మోదీని క‌ల‌వ‌డంపై టీడీపీలో తీవ్ర చ‌ర్చ‌జ‌రుగుతోంది.అయితే భేటీని మాత్రం భాజాపా స‌మ‌ర్థించింది.
వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీని క‌లిసిన విష‌యం ఇప్పుడు రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. విభ‌జ‌న బిల్లులో ఉన్న వాటిని వెంట‌నే అముల చేయాల‌ని…. ఏపీకీ ప్రాణ‌మైన ప్ర‌త్యేక హోదాను వెంట‌నే ప్ర‌క‌టించాల‌ని అదేవిధంగా రైతులు పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధాని మోదీకి వివ‌రించేందుకు వెల్లారు.అయితే దీనిపై ఉహాగానాలు మొద‌ల‌య్యాయి.టీడీపీకి బ‌ద్ధ శ‌త్రువైన జ‌గ‌న్‌కు మోదీ అపాయంట్ మెంట్ ఇవ్వ‌డాన్ని జీర్నించుకోలేక‌పోతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.
ఇప్ప‌టికే రాష్ట్రంలో భాజాపా-టీడీపీ మ‌ధ్య అంత‌రం పెరిగిపోతోంది. పైకి ఇద్ద‌రు క‌ల‌సి ఉన్నా లోలోప‌ల మాత్రం ర‌గిలి పోతున్నారు. భాజాపా నాయ‌కులు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై సందు దొరికి న‌ప్పుడ‌ల్లా విరుచుకు ప‌డుతున్నారు.2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తామ‌ని క‌మ‌ల‌ద‌లం ప్ర‌క‌టించ‌డంతో టీడీపీతో బంధం తెల‌గిపో్యిన‌ట్లేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. .జ‌గ‌న్ మోదీని క‌ల‌వ‌డాన్ని భాజాపా నేత‌లు స‌మ‌ర్థించుకుంటున్నారు.ఎవ‌రైన ప్ర‌ధాన మంత్రిని క‌ల‌వ‌చ్చ‌ని …దీనికి జ‌గ‌న్ కేసుల‌కు సంబంధంలేద‌ని ఈ విష‌యంలో టీడీపీ రాద్దాంతం చేయ‌డం స‌రికాద‌ని భాజాపా నేత‌లు టీడీపీప‌పై మండి ప‌డుతున్నారు.ఈవ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్వ‌నంగా క‌నిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

జగన్ కు మోడీ అపాయింట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడ‌ని అవినీతిపరుడు అని అలాంటి వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఏంటని? తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక మోడీ ఎత్తుగడ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవసరం అయితే జగన్ తో కలిసి పోటీ చేసే యోచనలో బీజేపీ ఉందని, ఈ నేపథ్యంలోనే మోడీ ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మోడీతో భేటీ తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే రాజకీయ కోణం అర్థమవుతుందని, ఆయన పూర్తిగా మోడీకి మద్దతు ఇస్తున్నట్లు అర్థమైపోతుందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే పూర్తి మద్దతు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికైతే బాగుంటుందని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి, మోడీతో నెయ్యానికి జగన్ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకున్నారని అర్థమవుతుందని అంటున్నారు.
వ‌చ్చె ఎన్నిక‌ల్లో భాజాపా-వైసీపీ క‌ల‌సి పోటీచేస్తె టీడీపీ పుట్టి మున‌గ‌డం కాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు ఏపీలో ప్ర‌జాద‌ర‌న పెర‌గ‌డం…. మ‌రో వైపు ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌ల అసంతృప్తి పెరిగిపోతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజాపా,వైసీపీ క‌ల‌సి పోటీ చేస్తె టీడీపీ ప‌ని ఖ‌త‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -