అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఇప్పటికే చాలావరకు ఐటీ కంపెనీలు కుదేలవడంతోపాటు …. అంతర్గతంగా నష్టాలు చవిచూస్తుండగా.. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం చాలామంది ఉద్యోగులను సాగనంపేలా చేసింది.దేశీయ ఐటీ దిగ్గజాలపై పెను ప్రభావాన్ని పడింది.
రెవెన్యూల పరంగా అది దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ. కానీ గత ఐదేళ్లుగా వృద్ధిని నమోదుచేయడంలో ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది.దీంతో అకంపెనీని అమ్మేయేజనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు కలకం రేపుతున్నాయి.
{loadmodule mod_custom,GA1}
భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో అనూహ్య నిర్ణయం తీసుకోబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ కంపెనీని అమ్మేయాలనే యోచనలో ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.ప్రస్తుతం ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ, ఆయన కుటుంబమే విప్రోలో 73 శాతం వాటా కలిగిఉంది.అయితే రాబోయే రోజుల్లో ఇందులో కొంతైనా, లేదంటే పూర్తి వాటానైనా విక్రయించాలని ప్రేమ్ జీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు మనీకంట్రోల్.కామ్ కథనాన్ని వెలువరించడం గమనార్హం.
తన వాటాలను మంచి ధరకు కొనుగోలు చేయడానికి ఏదైనా ఎంఎన్‌సి ముందుకొస్తే.. విక్రయించడానికి ప్రేమ్ జీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎన్‌సి కానీ పక్షంలో ఏదైనా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ కైనా విప్రో కంపెనీని అమ్మేయాలని ప్రేమ్ జీ భావిస్తున్నారు. అయితే విప్రో యాజమాన్యం మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది.
{loadmodule mod_custom,GA2}
ఒకవేళ ఈ డీల్ కనుక జరిగితే 150 బిలియన్ ఐటీ ఇండస్ట్రీలో అలజడి రేకెత్తబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విప్రో యాజమాన్యం ఖండిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు కంపెనీ అధికార ప్రతినిధిని ఆశ్రయించగా, ఇవన్నీ నిరాధార రూమర్లేనని కొట్టిపారేశారు.కంపెనీ మిగులు నిధులను రాబట్టుకునేందుకు అమ్మకాలకు సిద్దమవుతున్నట్లు పేర్కొంటున్నారు.గడిచిన ఐదేళ్లలో విప్రో వృద్ధి రేటు సింగిల్ డిజిట్ కే పరిమితమైనా.. కంపెనీ మిగులు నిధులు మాత్రం రూ.34,474కోట్లు ఉన్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read