Sunday, May 12, 2024
- Advertisement -

త్వ‌ర‌లో స్టూడెంట్ ఎడిష‌న్ ల్యాప్‌ట్యాప్‌లు అందుబాటులోకి రానున్నాయి…

- Advertisement -

 

 

ప్రంచంలో టెక్నాల‌జీ పెరిగే కొద్ది సాప్ట్ వేర్ కంపెనీల మ‌ధ్య తీవ్ర‌పోటీ నెల‌కొంది. దీంతో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ధ‌ర‌లు కింద‌కు దిగివ‌స్తున్నాయి.ఇప్పుడు త‌మ అమ్మ‌కాల‌ను పెంచుకొనేందుకు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల్యాప్ టాప్‌ల‌ను అందిస్తున్నాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ స్టూడెంట్స్ కోసం తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన స్పెషల్ ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది. ‘

విండోస్ 10 ఎస్’ పేరిట విడుదలైన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం తీర్చిదిద్దారు. వారికి అవసరమైన పలు పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ఈ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ తీర్చిదిద్దింది.
అయితే విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్‌గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది. దాన్ని యూజర్లు మార్చలేరు. అదేవిధంగా ఈ ఓఎస్ ఉన్న పీసీలో సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే అది మైక్రోసాఫ్ట్ వెరిఫైడ్ సెక్యూరిటీ అండ్ ఇంటెగ్రిటీ ద్వారానే వీలవుతుంది. దీంతో పీసీకి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంద‌ని సంస్థ తెలిపంది. వైరస్‌లు, మాల్‌వేర్‌లు అంత సులభంగా వ్యాపించేందుకు వీలుండద‌ని … హ్యాకర్ల నుంచి కూడా రక్షణ ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ప్రొఫెషనల్ ఓఎస్‌లా పనిచేయదు. అన్ని డివైస్‌లకు సపోర్ట్ చేయదు. అయితే ఈ ఓఎస్ ఉన్న పీసీలను వాడే వారికి మాత్రం మైక్రోసాఫ్ట్ ఓ ఆఫర్‌ను అందజేయనుంది. విండోస్ 10 ఎస్ ను విండోస్ 10 ప్రొఫెషనల్‌కి అప్‌గ్రేడ్ చేసుకునేందుకు కేవలం రూ.3140 చెల్లిస్తే చాలు, సాఫ్ట్‌వేర్ కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. అప్పుడు ఏకంగా విండోస్ 10 ప్రొఫెషనల్ ఎడిషన్‌నే స్టూడెంట్లు వాడుకోవచ్చు.
విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన పీసీలో త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పీసీ తయారీ సంస్థలైన ఏసర్, అసుస్, డెల్, ఫ్యుజిత్సు, హెచ్‌పీ, శాంసంగ్, తోషిబా లతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన పీసీలను అత్యంత త్వరలోనే యూజర్లకు అందించనున్నారు. ఇవి రూ.12వేల ప్రారంభ ధరకు భారత్‌లో లభ్యం కానున్నాయి.

Related

  1. 1500 వంద‌ల‌కే స్మార్ట్ పోన్‌…
  2. రిలయన్స్ మరో సూపర్ ఆఫర్.. 148 కి 70 జీబీ
  3. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ భారీ షాక్‌…
  4. ఇది ఉంటే చాలు…గాలి, నీటితో చార‌జింగ్ చేసుకోవ‌చ్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -