ఈ కాలంలో ఆడవారు వంటింటికి మాత్రమే పరిమితం కావడం లేదు.. మగవారితో సమానంగా ఉద్యోగాలు.. ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఒడిషాకు చెందిన మోనాలీసా ఇప్పుడు యూట్యూబ్ సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో పలువురు మహిళలు.. యువతులు వినూత్నంగా తమ టాలెంట్ నిరూపిస్తూ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నారు. మోనాలీసా చేస్తున్న వీడియోలు వెబ్ దునియాలో దుమ్మురేపుతున్నాయి. యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది సొంత ఛానళ్లు స్టార్ చేసి వీడియోలు చేస్తున్నారు.
ఒడిషా సంప్రదయా పద్దతిలో చీర కట్టి , బొట్టు పెట్టి సాధారణ మహిళలా మోనాలిసా చేస్తున్నవీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆమె రూపొందిస్తున్న వీడియోల్లోని కొత్తదనం ఆకట్టుకుంటోంది. దీంతో మామూలు గృహిణి స్థాయి నుంచి యూట్యూబ్ స్టార్‌గా ఆమె ఎదిగింది. ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లా జాహర్ మోనాలీసా సొంతూరు. ఆమె భర్త బద్రి నారాయణ్ భద్ర క్రియేటివ్ వర్కర్. భర్త ప్రోత్సాహంతో సొంత యూట్యూబ్ ఛానల్‌ని 2016లో ప్రారంభించింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మోనాలీసా. సంప్రదాయ చీరకట్టులోనే ఆమె చేసిన ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియో, ట్రక్ డ్రైవింగ్, బుల్లెట్ డ్రైవింగ్, వోల్వో బస్ డ్రైవింగ్ వీడియోలు లక్షల కొద్ది వ్యూస్ సాధించాయి. తాజాగా మోనాలీసా సంప్రదాయపు చీర కట్టులో గుర్రపు స్వారీ చేస్తూ వీడియో అప్ లోడ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
అలాంటి పాత్రలకే ఓకే చెబుతుందట ఫిదా పిల్ల
ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్