Monday, May 20, 2024
- Advertisement -

కేంద్రం అండ చూసుకునే ఆరోపణలా?

- Advertisement -

టీడీపీ ప్రభుత్వంపై.. ఓ ప్రముఖ దినపత్రికలో వస్తున్న భూ దందా ఆరోపణలు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అండ్ కో.. నిజంగానే ఇంత అవినీతికి పాల్పడ్డారా అని సామాన్యుల్లో కూడా బలంగా అనుమానం వచ్చేంతగా.. ఆ కథనాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ఇందులో వాస్తవాలు, అవాస్తవాల విషయం పక్కన పెడితే.. రాజకీయంగా కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పార్టీ.. ఇలాంటి కథనాలను ప్రోత్సహించేందుకు కారణం.. బలమైన బ్యాక్ గ్రౌండే అన్న వాదన వినిపిస్తోంది.

ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీడీపీ కండువా కప్పుకొంటున్నారు. భూమా నాగిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా జగన్ ను కాదనుకుని మరీ.. వైసీపీని వదిలేసి వెళ్లిపోయారు. మరింత మంది సైకిల్ ఎక్కనున్నారని వార్తలు వినిపిస్తున్న టైమ్ లో.. వైసీపీ అనుకూల దినపత్రిలో వచ్చిన భూ దందా ఆరోపణలు సంచలనంగా మారాయి.

అయితే.. రీసెంట్ గా జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అప్పటి వరకూ ఎమ్మెల్యేల జంపింగ్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న జగన్.. గట్టి అండ చూసుకునే తన అనుకూల పత్రికలో అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే.. తనకు సమీప భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బంది రాకుండా కేంద్రం నుంచి హామీ తీసుకోవడంతోనే.. జగన్ ఇంతలా భారీ స్థాయి ఆరోపణలు చేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇప్పటికిప్పుడే ఏదీ తేలకపోయినా.. ఫ్యూచర్ లో అన్నీ స్పష్టమవుతాయనీ చెబుతున్నారు.

ఆలోచిస్తుంటే.. ఇందులోనూ కొంత వాస్తవం ఉండే ఉంటుందని అనిపిస్తోంది కదా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -