Saturday, May 18, 2024
- Advertisement -

అబ్బెబ్బే.. నేను చెప్పలేదు… రోజా

- Advertisement -

డామిట్ కథ అడ్డం తిరిగింది. కన్యాశుల్కంలో ఈ డైలాగ్ తో నాటకానికి స్వస్తి చెప్పించారు మహాకవి గురజాడ అప్పారావు. ఎమ్మెల్యే రోజా వ్యవహారం కూడా అలాగే మారింది. శాసనసభలో వివాదం.. ఏడాది పాటు రోజా సస్పెన్షన్.. ఆపై కోర్టుకు వెళ్లడం.. మళ్లీ శాసనసభలోకి వెళ్లాలనే వివాదం.. ఇలా తెలుగు సినిమాలా అనేక మలుపులు తిరిగిన రోజమ్మ… ఓ వివాదం.. సినిమా ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

ఈ మొత్తం వ్యవహారంపై హక్కుల కమిటీ ముందు హాజరైన రోజా క్షమాపణలు చెప్పారని కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అంటున్నారు. అంతేకాదు.. ఈ విషయాన్ని స్పీకర్ కోడెలకు నివేదిక రూపంలో ఇచ్చేసామని కూడా ఆయన చెబుతున్నారు. అయితే రోజా మాత్రం తాను క్షమాపణ చెప్పలేదని.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని మాత్రమే చెబుతున్నారు. అసెంబ్లీలో రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత ఫార్యాదు చేశారు.

దీనిపై విచారణ జరిపిన హక్కుల కమిటీ ముందు ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. తాను తప్పు చేయలేదని రోజా స్పష్టం చేశారు. హక్కుల కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మాత్రం రోజా కొన్ని అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారని, ఇందుకు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని వాదించారు.  కమిటీతో వాదోపవాదాల తర్వాత రోజా తాను చేసిందానికి క్షమాపణ చేప్పారంటూ గొల్లపల్లి సూర్యారావు ప్రకటించారు. అయితే రోజా మాత్రం తాను తప్పు చేయలేదు.. క్షమాపణ చెప్పలేదు. ఇది ఇద్దరు మహిళల మధ‌య జరిగిన వివాదం కాబట్టి కమిటీ ముందు హాజరయ్యానంటూ చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -