Wednesday, May 22, 2024
- Advertisement -

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యూబ్‌..

- Advertisement -

యూట్యూబ్… ఈ మధ్య కాలంలో కామన్ మ్యాన్‌కి సైతం చాలా దగ్గరైంది. ఏ సినిమా చూడాలన్నా…ఏ సాంగ్ వినాలన్న యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతినెల యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండే యూజర్ల సంఖ్య దాదాపుగా రెండుకోట్లు వరకు ఉంటారు. అలాంటి యూట్యూబ్ ఒక్క సారిగా ఆగిపోతే…ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. రాత్రి నుంచి జనాలకు చుక్కలు చూపించింది. ఏ వీడియో క్లిక్ చేసినా… ఓపెన్ కాలేదు. దీంతో యూజర్లు చిర్రెత్తుకుపోయారు.మంగళవారం రాత్రి సుమారు 9 గంటల నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్లే కాలేదు. ఏవీడియో క్లిక్ చేసిన ఇంజినీర్స్ ఆర్ డీలింగ్ విత్ ద ఇష్యూ అంటూ మెసేజ్ చూపించింది. ఇలా మనదేశంలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా కూడా యూట్యూబ్ డౌన్ అయ్యింది.

అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్‌ చేశారు.యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తున్నారు.

యుట్యూబ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందించింది యాజమాన్యం.ట్విట్టర్లో మెసేజ్ పోస్టు చేసింది. యూజర్లకు అందరికీ యూట్యూబ్ క్షమాపణలు చెప్పింది. యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్ , యూట్యూబ్‌లో సమస్యలు తలెత్తాయని,.. వాటిని తొందర్లోనే… పరిష్కరిస్తామని చెప్పుకొచ్చింది. తీవ్ర అసౌకర్యానికి గురైనందకు గాను యూజర్లకు అపాలజీ చెప్పింది. సాంకేతిక సమస్యను పరిష్కరించామని ప్రకటించింది. దీంతో నెట‌జ‌న్లు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -