ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్

ys jagan strong warning to three ycp leaders

వైసీపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ముగ్గురు కీల‌క నాయ‌కుల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశాడన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ ముగ్గిరిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాగా మ‌రొకరు మాజీ ఎమ్మెల్యే. వైసీపీలో గ‌త మూడేళ్ల‌లో ఎక్కువుగా వాయిస్ వినిపించిన వాళ్ల‌లో ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ రోజా, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.

{loadmodule mod_custom,GA1} 

చెవిరెడ్డి, రోజా అసెంబ్లీ బ‌య‌టా లోప‌ల చేసే హంగామాకు అంతే ఉండదు. రోజా అయితే.. అసెంబ్లీలో పెద్ద రచ్చ చేసి.. చివరకు అసెంబ్లీ నుంచి ఏడాది స‌స్పెన్ష‌న్‌కు గురైన విషయం తెలిసిందే. అయినప్పటికి ఆమె తన తీరును మాత్రం మార్చుకోలేదు. ఆ తర్వాత కూడా అలాంటి కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చాలానే చేసింది. ఇక చెవి రెడ్డి కూడా రోజాకు తక్కువేం కాదు. టీడిపీని టార్గెట్ చేసి.. విమ‌ర్శ‌లు చేశాడు. ఇక కాపు ఉద్య‌మం త‌ర్వాత మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తీరు కూడా కాంట్ర‌వ‌ర్సీగానే మారింది. ఇక ఇప్పుడు ప్ర‌శాంత్ జ‌గ‌న్‌కు ఇచ్చిన నివేదిక‌లో సైతం వీరి ముగ్గురు త‌మ దూకుడు త‌గ్గించుకోక‌పోయినా, కాంట్ర‌వ‌ర్సీ డైలాగ్స్‌కు శుభం కార్డు వేయ‌క‌పోయినా పార్టీకే న‌ష్ట‌మ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.ఈ నెపథ్యంలో.. ఈ ముగ్గురికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసిపీలో ఇది పెద్ద టాపిక్ గా మారింది.

{loadmodule mod_custom,GA2} 

భూమ‌న‌కు మ‌రోసారి టిక్కెట్ ఇవ్వ‌కుండా తిరుప‌తిలో మ‌రో వ్య‌క్తి పేరును జ‌గ‌న్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రోజాను సైతం పార్టిలో ఉంటావా.. బయటకు వెళ్తావా అని సీరియస్ అయినట్లు సమాచారం. ఇక చెవిరెడ్డికి.. కూడా జగన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

{youtube}T7fnpjX-n8Q{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్
  2. జగన్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎక్క‌డ బాబు…?
  3. చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్
  4. వైఎస్ జగన్ కు ఇవి లేనిదే ముద్ద దిగదు..