Friday, May 17, 2024
- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్టార్ వార్స్‌…

- Advertisement -

రాజ‌కీయాల్లో అసాధ్య‌మ‌నేది ఉండ‌దు. రాజ‌కీయం కోసం బ‌ద్ద‌శ‌త్రుల‌వులు ఒక ట‌వుతారు… ఇలాంటి వ‌న్ని ప్రాంతీయ పార్టీలేకాదు.. జాతీయ పార్టీలుకూడా అతీతం కాదు. వ‌స‌ర‌మైతె అన్న‌ద‌మ్ముల మ‌ద్య‌పోటైనా,నాన్న‌,కొడుకులు మ‌ద్య పోటీ అయినా త‌ప్ప‌దు. రాజ‌కీయీల‌కు బంధుత్వాలు ఉండ‌వు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు స్టార్ల‌మ‌ధ్య పోటీ త‌ప్ప‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చిన చిరు.. త‌ర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసి.. ఏకంగా రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోయారు. కొన్నాళ్లు కేంద్ర మంత్రిగా చ‌క్రం త‌ప్పారు. ఇక‌, మ‌రో కొన్నాళ్ల‌లో ఈ రాజ్య‌స‌భ స‌మ‌యం కూడా అయిపోనుంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలోగాని కేంద్రంలో గాని అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు దాదాపు శూన్యం.
చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాలనుకుంటే మరో పార్టీలో చేరాల్సిందే. అయితే తమ్ముడు పవన్ పెట్టిన జనసేనలోకి చిరంజీవి వెళతారనే వార్తలు వచ్చినా అవన్నీ ఊహాగానాలే అంటున్నారు. 2019 ఎన్నిక‌లు సిద్ధ ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీలో ఎద‌గాల‌ని భావిస్తోంది బీజేపీ.. అయితే ఒక బ‌ల‌మైన నేత అవ‌స‌రం.రాష్ట్రంలో టీడీపీ-భాజాపా మ‌ధ్య బంధం తెగిపోవ‌డం ఖాయం.
వైసీపీ అధినేత జ‌గ‌న్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వ‌తున్నారు. ఇక‌, ఏపీలో మూడు జిల్లాల్లో కాపులు ఉద్య‌మిస్తున్నారు. వీరికి త‌గిన హామీ ఇవ్వందే ఎన్నిక‌ల్లో గెలుపు సాధ్యం కాని పరిస్థితి.మ‌రోవైపు కాపు ఉద్య‌మం జోరుగా సాగుతోంది.ఈ స‌మ‌యంలో కాపుల ప‌క్షాన నిల‌బ‌డి వారిని ఓదార్చేవారికే ఓట్లు ప‌డ‌తాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ సమయంలో చిరంజీవిని దగ్గరకు చేర్చుకుంటే పార్టీకి ఏపీలో బలమైన పునాదులు వేసుకోవచ్చనే భావనలో బిజెపి అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెల్లారు.భాజాపా ఎద‌గ‌క‌పోవ‌డానికి వెంక‌య్యే కార‌న‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం కాపులను తమవైపు తిప్పుకునేందుకు వీర్రాజుని అధ్యక్షుడిని చేస్తే ఉపయోగం ఉంటుందని బిజెపి అధిష్టానం భావిస్తోంది. చిరంజీవి బీజేపీలో చేరి, వీర్రాజు అధ్యక్షుడు అయితే ఏపీలో పొలిటిక‌ల్‌గా పెను తుఫాను ఖాయం అంటున్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏంజ‌రుగుతాదో తెలియ‌దు. ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స్టార్ వార్స్ జ‌ర‌గ‌డంలో సందేహంలేదు.

https://www.youtube.com/watch?v=KR6TEkf_hIA

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -