Sunday, May 19, 2024
- Advertisement -

ఉత్తరాంధ్రలో టిడిపికి కోలుకోలేని షాక్… వైకాపాలోకి ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు

- Advertisement -

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తగలని షాక్ అతి త్వరలోనే చంద్రబాబు రుచి చూడనున్నాడా? 2019 ఎన్నికల వార్‌ని పూర్తిగా ఒన్ సైడ్ చేసే పరిణామం అతి త్వరలోనే చోటు చేసుకోనుందా? వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖలో అడుగిడిననాడే టిడిపి అంతానికి చేరువయినట్టేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అత్యంత సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వరుసగా విజయసాయితో మంతనాలు జరుపుతూ ఉన్నారు. వీళ్ళలో ఒక ఎమ్మెల్యేని విశాఖ ఎంపి అభ్యర్థిగా వైకాపా నిలబెట్టనుంది. విజయసాయితో చర్చల్లో అన్ని విషయాలు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ జగన్‌ని కలవనున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు, లోకేష్‌లు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ప్రయత్నించారు. అయితే యలమంచిలి రవితో సహా ఈ మధ్య కాలంలో చంద్రబాబు, లోకేష్‌ల మాటలు కేర్ చేసిన నాయకులు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా లోకేష్‌తో అయితే మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. ముందు ఆయనగారు యువరాజులా ప్రవర్తించడం మానుకోవాలని లోకేష్‌కే సలహా ఇచ్చారట. ఇక చంద్రబాబు కూడా తనదైన స్టైల్‌లో బుజ్జగించినప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చెయ్యడానికే రెడీ అయ్యారు. ఇప్పుడు టిడిపి, వైకాపాలతో పాటు అన్ని పార్టీల్లోనూ విజయసాయి మంత్రాంగం, వ్యూహాల గురించి చర్చ నడుస్తోంది. ముందు ముందు కూడా విజయసాయి ఇదే స్థాయిలో సక్సెస్ అయితే మాత్రం 2019 ఎన్నికల్లో వైకాపా ఘన విజయం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా జరిగినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదని ఇతర పార్టీల నాయకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -