Sunday, May 5, 2024
- Advertisement -

ఆళ్ళగడ్డ టిక్కెట్ ఇస్తే ఒకే……. లేదంటే వైసీపీలోకేః బాబుకు ఏవీ సుబ్బారెడ్డి వార్నింగ్

- Advertisement -

మంత్రి అఖిలప్రియ, ఎవీ సుబ్బారెడ్డిల మధ్య గొడవ విషయంలో చంద్రబాబు నిర్వహించిన పంచాయితీతో సమస్య పరిష్కారం అయితే కాలేదు కానీ ఒక స్పష్టత అయితే వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే గౌరవం అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వాధినేతగా కూడా అన్ని విషయాల్లోనూ నియంతృత్వ పోకడలే పోతూ ఉంటాడు. ఇక పార్టీ అధినేతగా చంద్రబాబు నియంతృత్వం గురించి టిడిపి నేతలే అంతర్గతంగా ఆవేదనతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అధినేత ఉన్న పార్టీలో ఎవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ లాంటి జూనియర్ నేతలు ఈ స్థాయిలో రెచ్చిపోవడమా అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు బాబు చేసిన పంచాయతీలో అసలు విషయాలు బయటపడ్డాయి.

‘ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు టిక్కెట్లు మూడూ భూమా కుటుంబానికే ఇవ్వాలా? సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాకు ఆళ్ళగడ్డ టిక్కెట్ ఎందుకు ఇవ్వరు? పోటీ చేయడానికి నాకు అర్హత లేదా?’ ఇవీ చంద్రబాబుతో సూటిగా ఎవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు. ‘నాకూ వయసు అయిపోతోందని, ఆళ్ళగడ్డ టిక్కెట్ ఇస్తే పార్టీలో ఉంటానని, లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు కోసం నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుంది’ అని చంద్రబాబుకు తేల్చి చెప్పాడు ఎవి సుబ్బారెడ్డి. వైకాపాతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అఖిల ప్రియ ఆ పార్టీ వైపు వెళ్ళకపోవచ్చు అన్నది చంద్రబాబు నమ్మకం. అందుకే ఎవి సుబ్బారెడ్డిని సుముదాయించడానికే ఎక్కువ సమయం చంద్రబాబు కేటాయించాడని తెలుస్తోంది. అయితే ఎవి సుబ్బారెడ్డి మాత్రం ఓదార్పు మాటలు, సానుభూతి మాటలు వద్దని, ఆళ్ళగడ్డ టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అని బాబును నిలదీశాడని తెలుస్తోంది. అఖిలప్రియ ముందు సీటు విషయంలో తనకు స్పష్టంగా చెప్పాలని…….ఆ తర్వాత తనకో మాట, నాకో మాట చెప్పి మా మధ్య విభేదాలు ఇంకా పెంచే రాజకీయం చెయ్యొద్దని బాబుతో చెప్పాడు ఎవి సుబ్బారెడ్డి. అయితే బాబు మాత్రం స్పష్టంగా ఏ విషయం చెప్పలేదు. అందుకే ఎవి సుబ్బారెడ్డి కోపంగా బయటకు వచ్చేశాడు. ఈ పరిణామాలతో హ్యాపీగా ఫీలయిన అఖిల ప్రియ మాత్రం తన సన్నిహితుల దగ్గర ఇంతటితో ఎవి సుబ్బారెడ్డి టిడిపిని వీడడం ఖాయం అన్న ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పుడు ఎవి సుబ్బారెడ్డి టిడిపిని వీడడం, వైకాపాలో చేరడం ఖాయమా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డికి ఆత్మబంధువు, అత్యంత అనుభవజ్ఙుడు అయిన ఎవి సుబ్బారెడ్డి పార్టీ వీడితే మాత్రం ఆళ్ళగడ్డలో 2019లో టిడిపికి ఓటమి ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సన్నిహితులతో ఆల్రెడీ ఎవి సుబ్బారెడ్డి చర్చలు నడుపుతున్న నేపథ్యంలో ఎవి సుబ్బారెడ్డి పార్టీ మారకుండా చంద్రబాబు ఎలాంటి వ్యూహం పన్నుతారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -