Saturday, May 18, 2024
- Advertisement -

రాజ‌కీయ పార్టీల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన సీక్రెట్ స‌ర్వే..

- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావాన్ని అన్ని పార్టీలు పూరించాయి. టీడీపీ ధ‌ర్మ‌పోరాట పేరుతో, వైసీపీ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర , ప‌వ‌న్ పోరుయాత్ర పేరుతో జ‌నాల్లోకి వెల్లారు.అధికారం మాదంటే మాదేన‌ని ఎవ‌రి లెక్క‌లు వాల్లు వేసుకుంటూ ధీమాగా ఉన్నారు.

జ‌న‌సేన‌-భాజాపా- వైసీపీ క‌ల‌సి పోటీ చేస్తాయ‌ని అది త‌మ‌కు లాభిస్తుంద‌ని బాబు ఉండ‌గా..2014 ఎన్నిక‌ల్లో అధికారానికి ఒక‌డుగు దూరంలో నిలిచామ‌ని ఈ సారి అధికారం మాదేన‌ని వైసీపీ ధీమాతో ఉంది. క‌ర్నాట‌క ఫ‌లితాలే ఇక్క‌డ కూడా పున‌రావృతం అవుతాయిని అప్పుడు నేనే కింగ్ మేక‌ర్‌ను అవుతాన‌ని జ‌న‌సేనుడా కోటీ ఆశ‌ల‌తో ఉన్నారు.

ఎన్నిక‌ల‌కు ఏడాది ఉన్న స‌మ‌యంలో నాయ‌కులు ఉహ‌ల్లో తేలుతుంటే .. ఇప్పుడు సర్వే మాత్రం వీరి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా ఉంద‌ట‌. కొన్ని ప్రధాన నగరాల్లో ప్రజా ప్రతినిధుల పనితీరుపై సర్వేలో అసంతృప్తి వ్యక్తమైందట‌.ఇటీవల కర్ణాటక ఎన్నికల సర్వే కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఓ సర్వే సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల మూడ్‌ ఎలా ఉందో తెలుసుకునేం దుకు ఆంధ్రప్రదేశ్‌లో సర్వే నిర్వహించింది. ఈ స‌ర్వేలో అన్ని పార్టీల‌కు దిమ్మ‌తిరిగే ఫ‌లితాలు వ‌చ్చాయంట‌.

బాబు బాగా క‌ష్ట‌ప‌డుతున్న‌ర‌ని మంచి మార్కులే వ‌చ్చాయంట‌. అయితే రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ట‌. ఎమ్మెల్యేల నియోజ వ‌ర్గాల్లో అవినీతి మాత్రం పెరిగిపోయింద‌ని ప్ర‌జ‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేశారంట‌. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాలో ప‌నులు జ‌ర‌గ‌క‌పోగా అవినీతి మాత్రం పెరిగిపోయింద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని స‌ర్వేలో తేలింది.

ఇక‌ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని చాలామంది తప్పుపట్టారట‌. జగన్‌ పాదయాత్ర నిర్వహించిన మార్గాల్లోనూ సర్వే జరిపింది. తాను అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతానని, అర్హత వయసును 45 ఏళ్లుగా చేస్తానని జగన్‌ చెప్పిన మాటలు పేదవర్గాల్లోకి వెళ్లాయని సర్వేలో తేలింది. ఇది జ‌గ‌న్‌కు సానుకూల అంశ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం గురించి ప్రస్తావించగా.. అందరూ చేస్తున్నారుగా అన్న సమాధానం వచ్చిందట! ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారు మాత్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నార‌ట‌. జగన్‌ పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా చంద్రబాబును తిట్టేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించినట్టు సర్వే చెబుతోంది.

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ఇంకా పార్టీ పూర్తిస్థాయిలో పార్టీ నిర్మానం జ‌ర‌గ‌లేద‌ని ఎన్నిక‌ల‌ప్పుడు చూద్దాం అన్న స్పంద‌న వ‌చ్చిందంట‌. ఈ సర్వే ఫలితాలు బయటికి రాకపోయినప్పటికీ, రెండు పార్టీల్లో ఉన్న కొంతమంది అగ్రనేతలకు మాత్రం తెలిసింద‌ట‌. ప్ర‌స్తుతం ఈ స‌ర్వే అన్ని పార్టీల నేత‌ల‌ను టెన్ష‌న్ పెడుతోంద‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యానికి స‌ర్వేలో మార్పులు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -