Wednesday, May 15, 2024
- Advertisement -

డేటా స్కామామ్‌లో వైసీపీనీ బుక్ చేయాల‌ని అడ్డంగా దొర‌కిపోయిన చంద్ర‌బాబు..

- Advertisement -

ఏపీ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారం చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల‌ల్లో దుమారం రేపుతోంది. ఈ కేసును ఛేదించేందుకు తెలంగాణా ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఏపీ ప్ర‌భుత్వం కూడా మాడేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చింద‌ని దానిపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యవహారం బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టినుంచి బాబు అండ్ కో కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఎక్క‌డ స్కామ్‌లో త‌మ బండారం బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని ఈ స్కామ్ ను ప్ర‌తిప‌క్షంపై వేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.

ఈ డేటా స్కామ్‌లో ఆధారాల‌తో స‌హా ప్ర‌తిప‌క్ష వైసీపీ బండారం బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు హ‌డావుడి చేశారు. బాబుకు సంబంధించిన ఎల్లోమీడియా కూడా ఏదో జ‌రిగిపోతోంద‌ని ఊద‌ర‌గొట్టింది. చివ‌ర‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఎలాంటి ఆధారాలు లేకుండానే, వాళ్ళిచ్చిన డాక్కుమెంట్‌లోనే వారి కుట్ర బ‌య‌ట‌ప‌డింద‌ని క‌హానీలు చెప్పారు. డొంక తిరుగుడు మాటలతో బాబుగారు సుమారు గంటసేపు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.చివరకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును చూపించారు. దీన్ని చూస్తె గుడ్డుమీద ఈక‌లు పీకిన‌ట్లుంది బాబు ప్రెస్‌మీట్‌.

ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టినుంచి ఐటీ గ్రిడ్ సీఈవో పార‌రీలో ఉన్నారు. తెలంగాణా పోలీసులు బృందాల‌ను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అంతే కాకుండా ఐటీ గ్రిడ్ కంపెనీ అశోక్ కుమార్‌ను విచారించి, డేటాను దొంగలించార‌ని చంద్ర‌బాబు అన్నారు. అస‌లు ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టినుంచి అశోక్ పార‌రీలో ఉన్నాడు. మ‌రి తెలంగాణా పోలీసులు ఎప్పుడు విచారించారో బాబుకో తెలియాలి.

ఇద‌లా ఉంటే ఈ డేటా స్కామ్ వ్వ‌హారంలో ఏలాంటి త‌ప్పు చేయ‌కుంటే ఎందుకు ఉలిక్కిప‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. డేటా చోరీ వెనుక టీడీపీ హ‌స్త‌ముంద‌ని అంద‌రికీ అర్ధ‌మైపోయింద‌ని, దీంతో కొత్త డ్రామాల‌కు తెర‌లేపుతున్నార‌ని అంద‌రికీ తెలిసిపోయింది. ఈ స్కామ్‌లో వైసీపీనీ బుక్ చేయాల‌ని చూసిన బాబు చివ‌ర‌కు తానె బుక్ అయ్యాడు. రెండు, మూడు రోజుల్లో అశోక్ బ‌య‌ట‌కు వ‌చ్చి అన్ని వివ‌రాలు చెప్తార‌ని సాక్ష్యాత్తు చంద్ర బాబే సెల‌విచ్చారంటే దీని వెనుక ఎవ‌రున్నార‌నేది ఇప్ప‌టికే అర్థం అయ్యింది. చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకొనేందుకు ఎంత బుకాయించినా చివ‌ర‌కు దొరికిపోవాల్సిందే…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -