Monday, May 20, 2024
- Advertisement -

బడ్జెట్‌లో ఎపికి జీరో……. బిజెపితో కటీఫ్ చెప్పడానికి చంద్రబాబు మంతనాలు?

- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయింపులు జీరో. ఇందులో ఆశ్ఛర్యపోవడానికి ఏముంది? తెలిసిన విషయమే కదా అంటారా? అయితే అలాంటి ఆశ్ఛర్యం కలిగించే షాకింగ్ నిర్ణయం తీసుకునేదిశగా చంద్రబాబు కదులుతున్నాడు. ఓటుకు కోట్లు కేసు పుణ్యమా అని ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాలను తాకట్టుపెట్టినప్పటికీ……మోడీ దగ్గర ఎంతలా సాగిలపడినప్పటికీ మోడీ మాత్రం కనీసం సీట్ల పెంపు విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం లేదు. ఆల్రెడీ సర్వేలన్నీ కూడా 2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్తున్నాయి. బిజెపి, టిడిపి, పవన్‌లు కలిసి పోటీచేసినా జగన్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో అయినా కాస్త కేటాయింపులు చూపించి తన పరువును మోడీ నిలబెడతాడని చంద్రబాబు ఆశించాడు. అయితే మోడీ మాత్రం పూర్తిగా హ్యాండ్సప్ అన్నాడు. రైల్వే జోన్‌తో సహా రాజధాని నిర్మాణంలాంటి ఏ విషయాన్ని కూడా నామ మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి పూరిగా సున్నా చుట్టేశాడనే చెప్పాలి. ఇకపై కూడా చంద్రబాబు మోడీతో కలిసి సాగితే 2019 ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్స్ కూడా దక్కవని టిడిపి సీనియర్ నేతలే మథన చెందుతున్నారు. బాబుకు సన్నిహితుడైన ఒక ఎల్లో మీడియా బాస్ కూడా బిజెపితో కలిసి ఉంటే జగన్‌కి అప్పనంగా అధికారం అప్పటించినట్టేనని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు బడ్జెట్ నేపథ్యంలో ఎపికి కేటాయింపులు లేకపోవడంతో ఇప్పుడే బిజెపికి కటీఫ్ చెప్పేస్తే బాగుంటుందని చంద్రబాబు తన వాళ్ళతో మంతనాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కూడా బిజెపితో తెగదెంపులు చేసుకోకకపోతే పూర్తిగా పుట్టి మునగడం ఖాయం అని చంద్రబాబు అనుకుంటున్నాట్ట. అయితే కోర్టుల్లో ఉన్న స్టేలు, ఓటుకు కోట్లు కేసు వ్యవహారమే చంద్రబాబు వెనుకంజ వేసేలా చేస్తోందట. అయితే కేసుల పుణ్యమాని ఎపి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టే విషయం ఎలా ఉన్నా……టిడిపిని, తన రాజకీయ భవిష్యత్తుని కూడా ఫణంగా పెడుతూ మోడీకి జై కొట్టాలా అని బాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ మిత్ర పక్ష అభ్యర్థిగా తప్పనిసరిగా బడ్జెట్‌ని పొగడాల్సిన స్థితి బాబుది. మరి ఈ సారి కూడా మోడీకి తలొగ్గి ప్రశంశల వర్షం కురిపిస్తాడో లేక ధైర్యంగా మోడీకి కటీఫ్ చెప్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -