Thursday, May 16, 2024
- Advertisement -

వెంక‌య్య నాయుడి ఉప‌రాష్ట్ర‌ప‌తి నామినేష‌న్‌కు వెల్ల‌ని చంద్ర‌బాబు..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు…కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మ‌ధ్య అనుబంధం గురించి చెప్ప‌టానికి మాట‌లు రావు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆంద్ర‌ప్ర‌దేశ్‌కి పెద్ద దిక్కుడా ఆయ‌న నిలిచాన‌డంలో సందేహంలేదు. అభ‌వృద్ధికి కావాల్సిన నిధుల విష‌యంలో వెంక‌య్య‌చూపిన చొరువ చెప్ప‌లేన‌ది. అలాంటిది ఇప్పుడు బాబు సంచ‌ల‌న నిర్న‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.
ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఈరోజు ఉదయం నామినేషన్ వేస్తున్నారు. అంతటి ముఖ్య ఘట్టానికి చంద్రబాబు మాత్రం వెళ్ళటం లేదు. కారణమేంటి? ఎవరికీ తెలియటం లేదు. ఎవరికి వారు కారణాలను ఆరాతీయటంలో బిజీగా ఉన్నారు.
మంగళవారం ఉదయం వెంకయ్య నామినేషన్ వేస్తున్నారని ప్రకటించారో అప్పటికప్పుడు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంతో పాటు సమన్వయ కమిటి సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో కూడా వెంకయ్యను చంద్రబాబు ఆకాశానికి ఎత్తేసారు. నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నట్లు సిఎం కార్యాలయం కూడా ధృవీకరించింది. అందుకనే మంగళవారం నాటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు కూడా చెప్పారు.
కాని అంత‌లో సీన్ రివ‌ర్స్ అయింది. ఏంజ రిగిందో ఎవ‌రికీ అంతువ‌ట్ట‌డంలేదు. అయితే హటాత్తుగా మంగళవారం నాటి సిఎం కార్యక్రమాలన్నీ యధావిధిగానే సాగుతాయని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళటం లేదని అందరికీ సమాచారం అందింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. గంటన్నర వ్యవధిలోనే పొలిటికల్ డెవలప్మెట్ ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు వెంకయ్య నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవ్వటం లేదన్న విషయాన్నే పార్టీలో నేతలెవ్వరూ నమ్మలేకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -