Saturday, June 1, 2024
- Advertisement -

40 ఇయర్స్ ఇండస్ట్రీ… ఏంటో ఈ కన్ఫ్యూజన్‌!

- Advertisement -

40 ఏళ్ల రాజకీయం…కానీ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూసుండరు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎందుకంటే 2024 ఎన్నికలు బాబు కెరీర్‌లో కీలకం కానున్నాయి. ఏడు పదుల వయస్సులో తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక వేళ కాలం కలిసిరాకపోతే ఇవే చివరి ఎన్నికలు కూడా కావొచ్చు. అందుకే బాబు రాజకీయ ఎత్తుగడ ఏంటీ..?2024లో బాబు మార్కు ఏజెండా అమలవుతందా…అసలు వచ్చే ఎన్నికల్లో బాబు రోడ్ మ్యాప్ ఏంటీ ఇప్పుడు ఇదే టీడీపీ శ్రేణులను కలవరపెడుతున్న ప్రశ్న.

అయితే రీసెంట్‌గా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చే ఎన్నికల్లో టీడీపీ చరిత్ర తిరగరాస్తుందని ప్రకటించారు. అంతేగాదు పొత్తులపై కూడా ఢిల్లీ వేదికగా సంకేతాలు కూడా ఇచ్చారు. బీజేపీ, జనసేతో పొత్తు ఉంటుందని…ఎన్నికల నాటికి ఈ అంశం కొలిక్కి వస్తుందని చెప్పారు. దీంతో అప్పుడే చంద్రబాబు ప్రకటించిన స్టేట్ మెంట్‌పై తెలుగు తమ్ముళ్లే కాదు అంతా అయోమయానికి గురయ్యారు. టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందంటూనే మళ్లీ పొత్తులు అంటారేంటి అని సందిగ్దంలో పడిపోయారు. బాబు కన్ఫ్యూజన్‌కి కారణమెంటో తెలియక అయోమయంలో పడ్డారు.

తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి లెక్కలు వేసుకుంటున్నారు చంద్రబాబు. అయితే ఆయన తనయుడు లోకేష్ మాత్రం పొత్తులకు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాబును కూడా కాదని లోకేష్‌కే సపోర్టు ఇస్తున్నారట టీడీపీ నేతలు. ఎందుకంటే పొత్తులతో తమ స్ధానాలను కొల్పోవాల్సి వస్తుంది. అందుకే సింహాం సింగిల్‌గా వస్తుందనే కాన్పెప్ట్‌లో లోకేష్ బ్యాచ్ ఉండగా చంద్రబాబు మాత్రం బీజేపీ,జనసేతో కలిసి వెళ్తెనే లాభం అని నేతలకు సూచిస్తున్నారట.

పొత్తులతోనే టీడీపీకి లాభం ఉంటుందని తన రాజకీయ అనుభవంతో చెబుతున్నారని నేతలో వెల్లడించారని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మైత్రి వల్ల టీడీపీకి కలిసి అదే సమయంలో బీజేపీని వైసీపీ నుండి దూరం చేసిన వాళ్లం అవుతామని బాబు భావిస్తున్నారట. ఒక వేళ బీజేపీతో మైత్రి కుదరని పక్షంలో స్నేహపూర్వక పోటీ అయినా ఉండేలా పావులు కదుపుతున్నారు చంద్రబాబు.

ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉంటే ముస్లిం,మైనార్టీ, క్రిస్టియన్‌ ఓట్లను మొత్తం టీడీపీ కొల్పోవాల్సి వస్తుంది. దీంతో స్నేహపూర్వక పోటీ అయినా ఉండేలా ప్లాన్ రచిస్తున్నారట. ఒక వేళ స్నేహపూర్వక పోటీ ఉంటే ఈ మూడు వర్గాల నుండి కనీసం 20 శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రాబడితే టీడీపీ గట్టెక్కుతుందని భావిస్తున్నారట. ఇక లోకేష్ పాదయాత్రపై కూడా బాబు ఓ క్లారిటీకి వచ్చారట. లోకేష్ పాదయాత్రకు అంతగా స్పందన రావడం లేదని సర్వేల్లో తేలిందట. తన స్పీచ్ ద్వారా ప్రజలను ఆకట్టుకోవడంలో లోకేష్ విఫలమయ్యారని అసలు లోకేష్ ప్రసంగాల్లో పస లేదని తేలిందట. అయితే లోకేష్ మాత్రం తనకు తాను హీరోగా ఊహించుకుంటున్నారని…అందుకు పొత్తుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని భావిస్తున్న చంద్రబాబు…ఈ విషయంలో తనయుడిని దూరంగానే ఉంచుతున్నారట. అందుకే బీజేపీతో స్నేహపూర్వక మైత్రి కొనసాగిస్తునే జనసేనతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే కలిసివస్తుందని అంచనా వేస్తున్నారట చంద్రబాబు. ఏదిఏమైనా చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తలెత్తలేదని టీడీపీ నేతలే చెబుతుండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -