Saturday, May 18, 2024
- Advertisement -

వైసీపీలోకి పారిశ్రామిక వేత్త‌..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ప్ర‌భావం బ‌లంగా అధికార‌పార్టీపై క‌న‌ప‌డుతోంది. ఆపార్టీనుంచి బ‌డానేత‌లు వైసీపీ వైపు చూస్తున్నారు. జ‌గ‌న్ కోస్తాజిల్లా ప‌ర్య‌ట‌న‌లో పార్టీకి ఊపువ‌స్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో వెలుగు వెలిగిన సూళ్లూరుపేట‌కు చెందిన వేనాటి సుమంత్‌రెడ్డి వైసీపీ ఖండువా క‌ప్పుకున్నారోలేదో ఇప్పుడు అధికార‌పార్టీకి మ‌రో దెబ్బ త‌గిలింది. బ‌డా పారిశ్రామిక వేత్త వైసీపీలో చేర‌నున్నారు.

జిల్లాలోని ప్రముఖ కాంట్రాక్టు సంస్ధల అధిపతుల్లో ఒకరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపిలో చేరుతున్నారు. ఈ మేరకు రంగం సిద్దమైంది. బహుశా ఆది, సోమవారాల్లో వేమిరెడ్డి జగన్ సమక్షంలో వైసిసి కండువా కప్పుకోనున్నారు. పాదయాత్రలో జగన్ 29వ తేదీన వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయనున్నారు. ఆ సందర్భంగా వేమిరెడ్డి వైసిపిలో చేరే అవకాశాలే ఎక్కువున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గ‌తంలో వేమిరెడ్డి పార్టీతో సంబంధాలు ఉండేవి. రాజ్య‌స‌భ‌సీటు విష‌యంలో విబేధాలు రావ‌డంతో పార్టీకి దూర‌మ‌య్యారు. తెరవెనుక జరిగిన ప్రయత్నాల వల్ల వేమిరెడ్డి చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జనగ్ ను కలిసారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో వేమిరెడ్డి-జగన్ భేటీ జరిగిందట. వారిమధ్య చర్చల సారాంసం తెలీదు కానీ మొత్తానికి వేమిరెడ్డి వైసిపిలో చేరటానికి సిద్దపడ్డారు.

వేమిరెడ్డి వైసిపిలో చేరటం టిడిపికి పరోక్షంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అదే సమయంలో వైసిసికి పెద్ద ప్లస్ అనుకోవాలి. ఎందుకంటే, వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వేమిరెడ్డి ఆర్దికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నారు. దీంతో పార్టీకూడా మ‌రింత బ‌లం పుంజుకోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -