Tuesday, May 21, 2024
- Advertisement -

ప‌ట్టిసీమ‌లో జ‌రిగిన అవినీతిపై సీబీఐ చేత విచార‌ణ జ‌రిపించాలి..భాజాపా

- Advertisement -

అసెంబ్లీలో భాజాపా,టీడీపీల మ‌ధ్య ప‌ట్టిసీమ‌ప్రాజెక్టుపై మాట‌లతో అసెంబ్లీ హీటెక్కింది. చంద్రబాబు లక్ష్యంగా బిజెపి ఆరోపణలు, విమర్శల స్ధాయిని పెంచుతోంది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌ట్టిసీమ‌లో అవినీతి జ‌రిగింద‌ని భాజాపా ప్లోర్ లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు సంల‌చ‌న ఆరోప‌న లుచేశారు.

ప్రాజెక్టులో రూ. 371 కోట్లు అవినీతి జరిగిందన్నారు. దీనిపై సీబీఐతో గాని సిట్టింగ్ జ‌డ్జీతో గాని విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. గతంలో ఇదే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా నిర్ధారించిన విషయాన్ని రాజు గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి తప్పు జరగలేదన్నప్పుడు విచారణ చేయింటానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని నిలదీశారు.

అవినీతిపై ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని తమను ప్రశ్నిస్తున్నారని… తనేమీ సీబీఐని కాదని, తమకు అందిన రిపోర్టుల మేరకే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. తానేదో జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్టు కామెంట్ చేస్తున్నారని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -