Monday, May 20, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు వెన్నుపోటు పొడిచారు… బాబు పోటుకు బ‌లిఅయ్యారు

- Advertisement -

రాజ‌కీయాల్లో దాదాపు ప్ర‌జాసేవ అన్న‌ది ఎడారిలో ఒయాసిస్ లాంటిది. న‌మ్మ‌కాలు, విశ్వాసాలు అనేవి ఉండ‌వు. అంతా స్వార్థ‌రాజ‌కీయ‌మే. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ త‌రుపున ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఇచ్చే తాయిలాల‌కు ఆశ‌ప‌డి ఫిరాయించిన ప‌రిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా త‌యార‌య్యింది. ఫిరాయంచిన నేత‌లంద‌రిని దాదాపు చంద్ర‌బాబు రోడ్డున నిల‌బెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క బిక్కుబిక్కు మంటున్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అనేక మందికి చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ల విష‌యంలో మొండిచేయి చూపారు. పార్టీలోకి ఫిరాయంచేట‌ప్పుడు అన్నిరకాల ప్యాకేజీలతో పాటు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ అనే హామీని కూడా ఇచ్చారు అనేది బహిరంగ సత్యం. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వీళ్లను కరివేపాకులను చేశారనే టాక్ వినిపిస్తూ ఉంది.

టికెట్లు ద‌క్క‌ని నేత‌ల్లో దాదాపు పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ, పాడేరు-ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం-ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తదితరులు ఉన్నారు.వీరితో పాటు యర్రగొండపాలెం – డేవిడ్‌రాజు, శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోడుమూరు- మణిగాంధీ, కదిరి- చాంద్‌ బాషా, బద్వేలు -జయరాములు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన త‌దిత‌రులు ఉన్నారు.

మంత్రి ఆదినార‌య‌ణ రెడ్డి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. గెల‌వ‌ని సీటు కేటాయించారు చంద్ర‌బాబు. ఇక ఎంపీల ప‌రిస్థితి కూడా ఇలానే త‌యార‌య్యింది. క‌ర్నూలు ఎంపీ ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. ఎస్పీవై రెడ్డికి కూడా ఆఖర్లో గట్టి ఝలక్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. టికెట్లు నిరాక‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం..వీరంద‌రూ సొంతంగా గెలిచిన నేత‌లు కాదు. జ‌గ‌న్ చ‌రిష్మాతో గెలిచిన వాల్లు. అందుకే ఈ సారి వారికి టికెట్ ఇస్తే జలు ఛీకొట్టే అవకాశం ఉండ‌టంతో బాబు టికెట‌క్లు ఇవ్వ‌కుండా నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. బుబు వెన్నుపోటును బ‌య‌ట‌కు చెప్పుకోలేక పోతున్నారు. ఎందుకంటె ….పార్టీ ఫిరాయించే స‌మ‌యంలో వాళ్ల‌కు అందిన ప్యాకేజీలు ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో క‌క్క‌లేక మింగ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారంట‌. జ‌గ‌న్‌కు వెన్నుపోటు పొడిచిన ఫిరాయింపు నేత‌లు బాబు పోటుకు బ‌లిఅయ్యార‌ని సామాన్య ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -