Wednesday, May 15, 2024
- Advertisement -

పంచాయితీ ఎన్నిక‌ల‌కు పూనుకుంటాడా… వెన‌క‌డుగు వేస్తారా చంద్ర‌బాబు….

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిలో కొత్త భ‌యం నెల‌కొంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి బాబుతో పాటు పార్టీ నాయ‌కుల్లో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. ఇప్పుడు తాజాగా కొత్త క‌ల‌వ‌రం నెల‌కొంది. ఈ కొత్త భ‌యం ఏంది అనుకుంటున్నారా…? అది పంచాయితీ ఎన్నిక‌లు.

పంచాయితీ కాల‌ప‌రిమితి వ‌చ్చే సంవ‌త్స‌రం ఆగ‌స్టునాటికి పూర్త‌వుతోంది. వెంట‌నే పంచాయితీ ఎన్నిక‌ల‌కు వెల్తారా లేకా వెన‌క‌డుగు వేసి సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత వెల్తారా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో సుమారు 16,500 పంచాయితీలు ఉన్నాయి. నియోజ‌క వ‌ర్గాల‌వారీగా లెక్క వేస్తే దాదాపు 110 అసెంబ్లీ నియోక వ‌ర్గాల‌కు స‌మానం. గ్రామీణ ప్రాంతాలు ఉన్న నియోవ‌క వ‌ర్గాలే ఎక్కువ‌.

అస‌లు విష‌యానికి వ‌స్తే టీడీపీ ప్ర‌స్తుతం పంచాయితీ ఎన్నిక‌ల మీద దృష్టి పెట్టింది. ఇప్పుడే ఎందుక‌ని అనుకుంటున్నారా ..అది కూడా జ‌గ‌న్ పాద‌యాత్రే కార‌న‌మ‌ట‌. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జా స్పంద‌న‌ను చూసి బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యింది. క‌డ‌ప జిల్లా అంటే జ‌గ‌న్ సొంత జిల్లాకాబ‌ట్టి జ‌నాలు వ‌చ్చార‌నుకుంటే…టీడీపీకి కంచుకోట‌గా ఉన్న జిల్లాల్లో సొంత జిల్లాకంటే రెట్టింపు సంఖ్య‌లో ప్ర‌జా స్పంద‌న ఎలా వ‌స్తుందో ప‌చ్చ‌పార్టీ నాయ‌కుల‌కు అర్థంకాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ గ్రామీణ ప్రాంతాల‌మీద‌నే ఫోక‌స్ పెట్టారు.

ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ప‌ట్టు ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో దెబ్బ కొట్టేందుకు టీడీపీ త‌న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించాలంటే ముందుగా పంచాయితీల ఎన్నిక‌లే ముఖ్యం. పంచాయితీల‌పై ప‌ట్టు సాధిస్తే త‌రువాత సార్వ‌త్రిక ఎన్నిక‌లు మ‌రింత బ‌లం చేకూరుతుంది. మ‌రో వైపు గ్రామీణ ప్రాంతాల్లో వ‌స్తున్న ప్ర‌జా స్పంద‌న‌ను చూస్తే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఎంత ఉందో అర్ధ‌మ‌వుతోంద‌ట టీడీపీకి. అంతే కాకుండా పాద‌యాత్ర‌ను ద‌గ్గ‌రుండి మానిట‌ర్ చేస్తున్న ఇంట‌లిజెన్స్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్టును బాబుకు అందిస్తోంది.

ఇప్ప‌టికే ఇంట‌లిజెన్సీ రిపోర్టే కాకుండా వివిధ మార్గాల ద్వారా స‌మాచారాన్ని తెప్పించుకుంటున్నారు బాబు. సాధార‌న ఎన్నిక‌లు మంచుకొస్తున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు వెల్తే ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలియ‌ని ప‌రిస్థితులు. మ‌రో సారి అధికారం సాధించాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లుగా టిడిపి నియోజకవర్గాలను వర్గీకరించింది. ఎలాగూ అధికారం చేతుల్లో ఉంది కాబ‌ట్టి పంచాయితీ ఎన్నిక‌ల్లో గెలిస్తే త‌ర్వాత ఎన్నిక‌ల్లో .టీడీపీకి తిరుగుండ‌దనే భావ‌న‌లో ఉంది టీడీపీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -