Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు ఐటీ నోటీసులు..కీలక పరిణామం!

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవమారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు విదేశాలకు వెళ్లారు. ఐటీ శాఖ రికార్డు చేసిన స్టేట్‌మెంట్‌లో మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాసరావు కీలకం. ఇక వీరిద్దరికి నోటీసులు ఇచ్చే సమయంలో విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులకు గుర్తించారు. ఈ నెల 5న వాసుదేవ్ దుబాయ్ కు, చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు 6న అమెరికాకు వెళ్లినట్లుగా ఐటీ అధికారులు నిర్ధారించారు.

దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ నోటీసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కావాలనే ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరని విదేశాలకు పంపించారని…ఇది స్వయంగా ఆయన ఒప్పుకోకుండానే ఒప్పుకున్నట్లు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై చంద్రబాబు నేరుగా ఎందుకు స్పందిచకుండా వెనుకడుగు వేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానిగా నిర్మాణ పనులు చేపట్టింది టీడీపీ సర్కార్. ఇక ఇందులో చంద్రబాబుకు భారీగా లబ్ది చేకూరిందని ఐటీ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మనోజ్, శ్రీనివాస్ ఇళ్లపై దాడుల సందర్భంగా కీలక డాక్యుమెంట్లు, వీరిద్దరి నుండి రికార్డు స్టేట్ మెంట్ రాబట్టారు. ఇక మనోజ్…చంద్రబాబు ముడుపులకు సంబంధించిన వివరాలను పూస గుచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబుపై విచారణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడంతో ఐటీ శాఖ అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -