Wednesday, May 15, 2024
- Advertisement -

కొత్త మంత్రి వ‌ర్గంతో ఎన్నిక‌ల‌కు వెల్ల‌నున్న బాబు….

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. మ‌రో సారి తెనెతుట్టెను క‌దిలించ‌బోతున్నారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రో సారి కేబినేట్‌ను ప్ర‌క్షాల‌న చేయ‌నున్నార‌నె వార్త‌లు మంత్రి వ‌ర్గంలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. మంత్రి వ‌ర్గంలో ఎవ‌రు ఉంటారో….ఎవ‌రి పేర్లు గ‌ల్లంతు అవుతాయోన‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. విశ్వ‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆరుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. పార్టీ ఫిరాయిపుదారుల‌కు పెద్ద పీట వేయ‌డంతో చాలా మంది న‌తలు బాబుపై అసంతృప్తిని బ‌హిరంగంగానె వ్య‌క్తం చేశారు. అయితే వారిలో కొంత‌మంది అంచ‌నాల‌ను అందుకోలేక‌పోతున్నార‌నే కార‌నాల‌తో ఆరుగురిపై వేటు వేయ‌నున్నారు బాబు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని , ప్ర‌భుత్వం రెండింటిని స‌మ‌న్వ‌యం చేసె వారిని క్యాబినేట్‌లోకి తీసుకోనున్నారు.

క్యాబినేట్‌నుంచి తొల‌గించిన మంత్రుల‌ను పార్టీ కోసం ఉప‌యేగించే ప‌నిలో ఉన్నారు చంద్ర‌బాబు. వేటు వేసె వారిలో మంత్రి భూమా అఖిల‌ప్రియ‌పేరు సైతం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక భాజాపా నుంచి ఇన్న ఇద్ద‌రు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నారు. వారిస్థానంలో వేరే వారిని తీసుకోనున్నారు.భాజాపాను సంప్ర‌దించిన త‌ర్వాతె వారి విష‌యంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

కొత్త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌నకోసం స‌మూల మార్పుల దిశ‌గా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దీపావ‌ళి త‌ర్వాత ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. క్యాబినేట్‌నుంచి ఆరుగురిపై వేటు వేసి ఆరుగురిని తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికె కొంద‌రు మంత్రులు వారి వాయిస్‌ని వినిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని తెలుస్తోంది. క్యాబినేట్‌లో కీల‌కంగాఉన్న న‌లుగురు మంత్రుల‌తోపాటు భాజానుంచి ఇద్ద‌రిని త‌ప్పించ‌డం ఖాయం.

టీడీపీ తొల‌గింపు మంత్రుల‌లో గంటా, అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘ‌వ‌రావు, భూమా అఖిల‌ప్రియ పేర్లు ఉన్నాయ‌ని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. క‌ర్నూలు జిల్లాలో మంత్రి అఖిల ప్రియ‌ను త‌ప్పించి ఆమె స్థానంలో వేరొక‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారంట‌. మంత్రి వ‌ర్గంనుంచి అఖిల‌ను త‌ప్పిస్తే ఎలా రియాక్ట్ అవుతారోన‌నె ఆలోచ‌న‌లో ఉన్నారు బాబు. ఎన్నిక‌ల కోస‌మె అఖిల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నె వార్త‌లకు బ‌లం చేకూర్చిన‌ట్లు అవుతుంది.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత ఏర్పాట‌య్యే మంత్రి వ‌ర్గంతో ఎన్నిక‌ల‌కు వెల్లాల‌ని బాబు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అసంతృప్తులు బ‌హిరంగంగానె విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రి ఈసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎలాంటి ప‌రినామాల‌కు దారి తీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -