Saturday, May 18, 2024
- Advertisement -

జగన్‌ని తిట్టే టిడిపి నేతలకు జేసీ రాజకీయమే గొప్పగుణపాఠమా?

- Advertisement -

జగన్‌పై ఒంటికాలిపై లేచిన జేసీకి వైనం తెలిసొచ్చింది. చంద్రబాబు అండ చూసుకుని జేసీలిద్దరూ కూడా జగన్‌పై నీచమైన భాషలో విమర్శలు చేశారు. జేసీ ప్రభాకరరెడ్డి అయితే జగన్ తల్లిని కూడా విమర్శించాడు. ఇక జేసీ కూడా ఏరా….పోరా….అనే స్థాయిలో మాట్లాడేశాడు. చంద్రబాబు కూడా జేసీల విమర్శలను పూర్తిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఎంకరేజ్ చేశాడు. జేసీల చేత జగన్‌ని తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. అయితే చంద్రబాబు మెప్పు కోసం జగన్ విషయంలో రెచ్చిపోయిన జేసీలకు ఇప్పుడు అదే చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నాడు.

జేసీ దివాకరరెడ్డి ఆర్థిక బలం, అంగబలాన్ని పూర్తిగా వాడుకున్న చంద్రబాబు జేసీలకు చేసింది మాత్రం ఏమీలేదు. జేసీీలకు వ్యతిరేకంగా….శతృత్వం ఉంది అనే స్థాయిలో వ్యవహరిస్తున్న టిడిపి మునిసిపల్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ని తప్పించమని జేసీలు చంద్రబాబును వేడుకుంటున్నప్పటికీ బాబు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు 2019 ఎన్నికల్లో తన స్థానంలో తన కొడుకును అనంతపురం ఎంపిగా నిలబెట్టనున్నాడు జేసీ. ఇక జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అలాగే జేసీల ఇంటి మనుషులతో పాటు జేసీ ముఖ్య అనుచరులు కూడా ఈ సారి అనంతపురంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం జేసీ దివాకరరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జేసీల విజ్ఙాపనలను అస్సలు పట్టించుకోవడం లేదు. కారణం ఏంటా అని ఆరా తీసిన జేసీలకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. జేసీలు అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తారు? టిడిపిని విడిచిపెట్టగలరా? ఏ పార్టీలోకి వెళతారు? జగన్‌ని ఆ స్థాయిలో విమర్శించిన తర్వాత జేసీలకు టిడిపిలో ఉండడం తప్ప వేరే ఏం ఆప్షన్ ఉంది అని టిడిపి నేతలతోనే చంద్రబాబు అభిప్రాయపడ్డారట.

అత్యుత్సాహపడిపోయి బాబు మెప్పుకోసం జగన్‌ని తిడితే……ఇక ఆ తర్వాత నుంచి టిడిపిలో పూచికపుల్లపాటి విలువ కూడా ఉండదన్న నిజం జేసీల ద్వారానే టిడిపి నేతలకు తెలిసిందట. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయాలను తట్టుకోవాలంటే లౌక్యం చాలానే ఉండాలని……మరీ గుడ్డిగా నమ్మితే పూర్తిగా మునిగిపోతామని ఇప్పుడు జేసీ వర్గం జనాలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు కంటే జేసీలే సీనియర్లు. కానీ ఇలాంటి వెన్నుపోటు రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుకు ఉన్న సీనియారిటీ దేశంలోనే ఇంకెవ్వరికీ లేదని ఇప్పుడు జేసీల కాంపౌండ్‌లో చంద్రబాబు రాజకీయంపై సెటైర్స్ పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -