Sunday, May 5, 2024
- Advertisement -

ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ ముగిసిన‌ట్టేనా…?

- Advertisement -

ఆళ్లగడ్డ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య రాజీ కుదిరింది. ఇద్దరినీ పిలిచి చర్చించిన చంద్రబాబు… నచ్చజెప్పి పంపారు. ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి గుర్తుకు రావాలి కానీ, విబేధాలు వద్దంటూ చంద్రబాబు సూచించారు. దీంతో వారిద్దరూ సర్దుకుపోయేందుకు రెడీ అయ్యారు.

పైకి క‌ల‌సిపోయామ‌ని చెబుతున్నా ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తనపై రాళ్ల దాడి చేయించిన రాష్ట్ర మంత్రి అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు తన డిమాండ్‌ను పట్టించుకోలేదని, తన ఆవేదనను అర్థం చేసుకోలేదంటూ సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు.

మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో చంద్రబాబు.. విడివిడిగా, ఉమ్మడిగానూ చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అఖిల ప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారని, అలాగే ఆయన కుమార్తె కూడా తనపై విమర్శలు చేశారని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి.. చంద్రబాబు ముందు రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను ఉంచారు. ఈ విషయంపై అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. కాని చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు.

సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలుపుతూ అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు. అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు చెప్పారు. టీ క‌ప్పులో తుఫాను అని టీడీపీ నేత‌లు చెబుతున్నా త‌రువాత ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -