Thursday, May 16, 2024
- Advertisement -

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు…సీట్ల పంప‌క‌మే మిగిలింది…

- Advertisement -

తెలంగాణాలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుపై ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ పార్టీతో పొత్తుంటుంద‌ని 8న చంద్ర‌బాబు నాయుడ‌తో చ‌ర్చిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ ముందుగానే అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డంతో చేసేది లేక పొత్తు ఉంటుంద‌ని చెప్ప‌క ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతో సిగ్గులేకుండా పొత్తు పెట్టుకోంది. ఇప్ప‌టికే తెలంగాణాలో టీడీపీ చివ‌రి ద‌శ‌కు చేర‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసీం ఉనికిని చాటుకోవ‌డానికైనా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బాబు పొత్తు పెట్టుకుంటున్నార‌న్న సంగ‌తితెలిసిందే. రేవంత్ రెడ్డిని వ్యూహాత్మ‌కంగా ముందుగానే కాంగ్రెస్‌లోకి పంపించార‌న్న వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను అధికారానికి దూరం చేయాలంటే ఇతర పార్టీలతో పొత్తులు అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. హరికృష్ణ దశదినకర్మలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అయితే హైద్రాబాద్‌కు చంద్రబాబునాయుడు వస్తున్నందున ఆయనతో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌ద్యంలో కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు ఒక క‌మిటీనీ నియ‌మించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ క‌మిటీలో రేవంత్ రెడ్డి మెంబ‌ర్‌గా ఉన్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డికి కమిటీలో చోటు దక్కింది. దీంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మిగింలింది సీట్ల పంప‌క‌మే. ఏపార్టీకి ఎన్నిక‌సీట్లు అన్న‌ది క‌మిటీ తేల్చ‌నుంది.

టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల చిచ్చు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే టిక్కెట్ల గొడవ ఉంటుంది. ఇక టీడీపీ కలిస్తే, ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తే కాంగ్రెస్‌కు మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవని అంటున్నారు. పొత్తులపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అంతర్గత సమావేశంలో నిలదీస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణాలో బ‌ద్ద శ‌త్రువులుగా ఉన్న రెండు పార్టీలు క‌ల‌సి ప్ర‌యానం చేయ‌బోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -