Thursday, May 2, 2024
- Advertisement -

రేవంత్ మార్క్..మంత్రులకు శాఖలు

- Advertisement -

తెలంగాణ ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్ సర్కార్) కొలువు దీరింది. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో సీఎంగా రేవంత్ రెడ్డితో పాటుగా 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రుల ఎంపిక దగ్గరి నుండి వారి శాఖలు, స్పీకర్ పోస్ట్ వరకు రేవంత్ తన మార్క్ చూపించారు.

స్పీకర్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఎంపిక చేయగా కేబినెట్‌లో ఇద్దరు దళితులు భట్టి విక్రమార్క,దామోదర రాజనర్సింహాలకు చోటు దక్కింది. ఇక ఇద్దరు మహిళలు సీతక్క, కొండా సురేఖలను తీసుకుని సమతుల్యం పాటించారు.

మంత్రులకు కేటాయించిన శాఖలను పరిశీలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ కేటాయించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్ రెడ్డికి మున్సిపల్ శాఖ కేటాయించింది. నీటి పారుదల శాఖను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మహిళా సంక్షేమం కొండా సురేఖకు, రెవెన్యూ శాఖను కొండా సురేఖకు, మెడికల్ అండ్ హెల్త్‌ను దామోదర రాజనర్సింహాకు, పౌర సరఫరాలు జూపల్లి కృష్ణారావుకు, గిరిజన సంక్షేమంను సీతక్కకు, రోడ్లు భవనాల శాఖను తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -