Saturday, April 27, 2024
- Advertisement -

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

- Advertisement -

తెలంగాణ  వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది లేదు అందుకే కేసీఆర్ రెండు ఎన్నికల్లోనూ మంచి మెజారిటీ తో గెలుస్తూ వచ్చారు.. ప్రజా సంక్షేమ పథకాలు అమలు తో పాటు ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమయంలో ప్రజలకు కొండంత ధైర్యం ఇవ్వడం వల్లే కేసీఆర్ ప్రజల్లోకి దూసుకుపోవడానికి కారణం అని చెప్తుంటారు.. ముఖ్యంగా ముఖ్యంగా ఉప ఎన్నికలొచ్చినప్పుడు కేసీఆర్ అవిశ్రాంత శ్రమ నే ఎప్పుడు ఆయన్ని గెలిపిస్తూ ఉంటుంది.. ఇక ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు తెలంగాణాలో ఆసక్తి కర రాజకీయం చేయడానికి ఊతం గా మారుతున్నాయి..

కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల పై దృష్టి పెట్టగా, హరీష్ రావు దుబ్బాక ఎన్నికల్లో పార్టీ గెలిచేవిధంగా కృషి చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తనకు తగ్గ ఓ పని చూసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి గెలుపుపై కన్నేశారని తెలుస్తుంది. పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ గెలిచిన తీరాల్సిన ఎన్నికలుగా కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. అందుకే.. ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేశారు.

విద్యావంతుల్లో తెలంగాణ సర్కార్ పై కొంత వ్యతిరేక త ఉందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి ఈ ప్రచారం వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బంది గా మారుతుందని తెలిసి కేసీఆర్ స్వయంగా దిగారని తెలుస్తుంది. గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డి…. ఆ తర్వాత గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. భారీ మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థికి పెద్దగా మద్దతు దక్కలేదు. గతంలోనూ హైదరాబాద్ – రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వచ్చి పార్టీ ని చక్కదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు.. మరి ప్రజలు కేసీఆర్ మాటకు లోబడి గులాబీ వెంట ఉంటారా అన్నది చూడాలి..

కేసిఆర్ పైన కోదండ రాం ఎత్తులు ఫలించేనా..?

దుబ్బాక లో హరీష్ టీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగించేనా..?

కెసిఆర్ ప్రభుత్వం కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందా..?

కెసిఆర్ లానే సోము కూడా వాగ్దానాలు చేస్తున్నాడే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -