Sunday, April 28, 2024
- Advertisement -

ఉత్తమ్ పోస్ట్ ఊడుతుందా.. కాంగ్రెస్ నేతలే చెప్తున్నారుగా.?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారిపోతోంది చెప్పొచ్చు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో ఈ విషయం స్పష్టంగా తెలియగా ఇకపై కాంగ్రెస్ పార్టీ ఎలా కొనసాగుతుందో అని అందరు చూస్తున్నారు.. మంచి బలం , బలగం ఉన్న చోట కూడా కాంగ్రెస్ టీ.ఆర్.ఎస్ దెబ్బకు కుదేలైపోయింది.. అప్పటినుంచి కాంగ్రెస్ మరింత ఢీలా పడిపోయిందని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అస్సలు కోలుకోలేదు.. దీనికి తోడు తెలంగాణ లో బీజేపీ కూడా పుంజుకోవడంతో కాంగ్రెస్ కి వచ్చే ఆ తక్కువ సీట్లు కూడా రాకుండా పోయాయి.. ప్రజల్లో సైతం కాంగ్రెస్ పట్ల నమ్మకం సడలిపోతుంది..

సరైన నాయకుడు, నాయకత్వం లేకపోవడం వలన కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైందని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల విభేదాలు, రోడ్డున పడి రాని లేని అధికారం కోసం పోట్లాడి ప్రజల దృష్టిలో మరింత చీప్ అయిపోయారు.. ఇక పార్టీ ఇలా అయిపోవడానికి ముఖ్య కారణంగా ఉత్తమ్ కుమార్ ను నిందిస్తున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులూ.. ఉత్తమ్ సరిగ్గా రాజకీయం చేసి ఉంటె రాష్ట్రంలో పార్టీ పరిస్థితి వేరేలా ఉండేదని జోస్యం చెప్పారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కనీస మద్దతు ను కూడగట్టలేకపోయారు, సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు అని ఆయనపై కొంతమంది కాంగ్రెస్ నాయకులూ విమర్శలు చేశారు..

ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నిక విషయంలోనూ ఆయనపై కొందరు విమర్శలు చేస్తున్నారు.. అయితే కేసీఆర్ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. స్వయంగా దుబ్బాక మండలానికి తానే బాధ్యుడిగా ఉంటున్నారు. తనకు సన్నిహితులైన ఇతర నేతలకు ఇతర మండలాల బాధ్యతలు ఇచ్చారు. అభ్యర్థిని కూడా తానే ఎంపిక చేశారు. నర్సారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయిస్తూ.. పేరును హైకమాండ్‌కు పంపారు. ఒక్క పేరే పంపారు కాబట్టి.. ఖారరయ్యే అవకాశం ఉంది. ఇతర ముఖ్య నేతలు.. ఈ ఎన్నికల్లో యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొన్నా.. వ్యూహాలు.. ఇతర వ్యవహారాల్ని మొత్తం.. ఉత్తమ్‌కే వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఓ రకంగా ఉత్తమ్‌కు దుబ్బాక ఉపఎన్నిక అగ్నిపరీక్షగా మారిందని చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -