Saturday, April 27, 2024
- Advertisement -

కేసిఆర్ పైన కోదండ రాం ఎత్తులు ఫలించేనా..?

- Advertisement -

తెలంగాణ లో ఆసక్తి కర రాజకీయం మొదలు కాబోతుంది.. ఎన్నికలు మొదలవుతున్న వేళా అన్ని పార్టీ లు తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే దుబ్బాక లో ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో రాజకీయం కాస్త వేడెక్కగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి.. ఇప్పటికే ఈ ఎన్నికలపై టి ఆర్ ఎస్ పార్టీ తరపున కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని సమాచారం వస్తుంది.. ఈ నాప్తయంలో ప్రతిపక్ష పార్టీ లనుంచి ఎటువంటి పోటీ ఎదురవుతుందో అని అందరు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..

ముందుగా  నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక జరగబోతుంది.  ఈ ఎన్నికల్లో  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగబోతున్నారు. అయితే గతంలో శాశన సభ ఎన్నికల్లో పాల్గొనకపోవడంతో అయన ఫాలోవర్స్ కొంత నిరాశ చెందిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం వారికి కొంత ఊరటనించింది.. అయితే కోదండరాం సోలో గా కాకుండా కలిసి కట్టుగా వస్తేనే గెలుస్తామని కోందండరాం ఒక కొత్త ప్లాన్ తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

టీఆర్ఎస్ మీద ఒక్క గెలుపు పిలుపు విపక్షాలకు వినపడాలన్నా ఇప్పుడు అంతా ఒక్కటి కావాలి అనే నినాదాన్ని కోదండరాం ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నాడట..దానికి తగ్గట్లే  కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోదండరామ్ కు మద్దతివ్వాలన్న యోచనలోనే ఉన్నారు. పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటించనున్నారు.కాంగ్రెస్ తో కలసి నడవడం బీజేపీకి ఇష్టముండదు. అందుకే బీజేపీ ఈ ప్రతిపాదనను అంగీకరించడం కష్టమేనంటున్నారు. అయితే అన్ని పార్టీలు కలసి ప్రొఫెసర్ కోదండరామ్ కు మద్దతిస్తే ఆయన విజయం నల్లేరు మీద నడకేనని చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -