Friday, May 17, 2024
- Advertisement -

కేసీఆర్ దెబ్బ‌కు మండ‌లిలో కాంగ్రెస్ చాప్ట‌ర్ క్లోజ్‌….?

- Advertisement -

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా పారాజ‌యం పాల‌యిన కాంగ్రెస్ పార్టీకీ మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. బంప‌ర్ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్ మ‌రింత దూకుడు పెంచారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌ని చూస్తున్న కేసీఆర్ ఒక‌డుగు ముందుకేశారు.మండ‌లిలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా చేయ‌డానికి పావులు క‌దుపుతున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్‌ కుమార్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌. ప్రభాకర్‌, కూచుకుంట్ల దామోదర్‌ రెడ్డి.. నిన్న టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసిన ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్‌ కాంగ్రెస్‌ మండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు శుక్రవారం లేఖ సమర్పించారు.

దీంతో తెలంగాణా రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. ఈ నేప‌థ్యంలో అధిష్టానం న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లకు దిగింది.దీంతో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఉన్న 7 మంది ఎమ్మెల్సీల సంఖ్య రెండుకు చేరింది. మిగిలిన ఇద్దరు సభ్యులు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పదవీకాలం మార్చిలో ముగియనుంది. దీంతో మండలిలో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం శూన్యమవనుంది.

కాంగ్రెస్ పార్టీ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ అప్రమత్తమయ్యారు. మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి కొద్దిసేపటి క్రితం మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను క‌లిసి పార్టీ విలీనంపై ఆయ‌న్ను నిల‌దీసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకున్న తర్వాతే విలీనంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

గ‌తంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ శాసనసభపక్షం టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు అప్పటి టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ ఇచ్చారు.ఈ లేఖపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -