Sunday, May 19, 2024
- Advertisement -

డాక్టర్ సుధాకర్ కేసు మళ్లీ మొదటికొచ్చిందా..?

- Advertisement -

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ విషయం పై కోర్టు సిబిఐ విచారణ కి ఆదేశించిన సంగతి తెలిసిందే.. ఆ కేసు కు సంబందించిన పూర్తి వివరాలు సిబిఐ అధికారాలు కోర్టు కు హాజరు పరచగా అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ప‌ని చేసిన డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసుని సిబిఐ గత పన్నెన్నడు వారాలుగా విచారిస్తుండగా ఇందులో కుట్ర అనే కోణం ఉందని తెలిపింది విచారణ బృందం.. అయితే వారు చెప్తున్న మిగితా విషయాలని చూస్తూనే కొండను తవ్వి ఎలుకను కూడా తేలేదని అనిపిస్తుంది.

దీంతో ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని మళ్ళీ కోర్టు ఆదేశించే ఆలోచనలో ఉందట.. సిబిఐ అందుకు ఒప్పుకునే అవకాశాలు ఉండడంతో మళ్ళీ మొదటినుంచి దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.. ఈమేరకు న‌వంబ‌ర్ 11న నివేదిక అందించాల‌ని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు నెలల గడువులో సిబిఐ ఎలాంటి నివేదిక ను సమర్పిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది..

ఇక డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు PPE కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దాంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేయగా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత గుండు గీయించుకుని ఎవరు గుర్తించని రీతిలో విశాఖ నడిరోడ్డుపై ధర్నా అనే పేరు తో కనిపించారు.. దాంతో పోలీసులు అత‌ని చేతుల‌ను వెన‌క్కి విడిచి అరెస్ట్ చేయ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది.ఈ నేపథ్యంలో మే 22న హైకోర్టు డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ కి అప్పగించగా సీబీఐ 12 వారాల్లో ఈ ఘణ కార్యం చేసింది..  ఇక ఇప్పుడు మ‌రో 8 వారాలు గ‌డువు తీసుకునైనా క‌నీసం ఈ కేసును ఇంచు అయినా కదలించాలని ప్రజలు కోరుకుంటున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -