Friday, March 29, 2024
- Advertisement -

బిజెపి : టిఎస్ లో బేష్ .. ఎపి లో తుస్ ..

- Advertisement -

సోము వీర్రాజు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆంద్రప్రదేశ్ లో పూర్తిగా అభాసుపాలు అయిపోయింది. గత ప్రభుత్వ హయాంలో కనీసం అక్కడో ఇక్కడో హాడావుడి ఈ పార్టీ తరపున జరిగేది. జగన్ అధికారం లోకి వచ్చిన అనంతరం ఏకచత్రాధిపత్యంగా పరిపాలన చెస్తూ, ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ అనేది లేకుండా , ప్రతి ఎన్నికల్లో విజయాలను అందుకుంటూ ఉంటే, కేంద్రం లో అధికారంలో ఉండి కూడా , బిజెపి ఎపిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతొంది‌ .‌

కానీ పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం బలమైన టిఆర్ఎస్ కు బిజెపి నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు ప్రతి ఎన్నికలో కేసిఆర్ కు షాక్ లిస్తూ , బలమైన ప్రతిపక్షం గా తెలంగాణ బిజెపి తయారవుతోంది. తాజాగా హూజూరాబాద్ లో బిజెపి సాధించిన విజయమే దీనికి నిదర్శనం. ఎపిలో కూడా కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ,ప్రభుత్వం పై ఘాటు విమర్శలు బిజెపి నుంచి వినిపించాయి. కేవలం సీనియర్ కార్యకర్త, కాపు సామాజిక వర్గం వ్యక్తి గా సోము కు ఎప్పుడయితే ,అధ్యక్ష పదవి ని ఇచ్చారో.. బిజెపి గ్రాఫ్ మైనస్ లొకి పోయింది.

తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో వైసిపి వార్ వన్ సైడ్ చేయగా, జనసేన సపోర్ట్ ఉండి కూడా బిజెపి ఓట్లను రాబట్టకోవటంలో విఫలమైంది. సోము వీర్రాజు , విష్ణువర్ధన్ రెడ్డి సునీల్ దియోదర్ లు, ఎపిలో పార్టీ ని ప్రమోట్ చేయటం కంటే కూడా , తమ పర్సనల్ పొకెట్ లను నింపుకునెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఎక్కువగా వినిపిస్తుంది. జగన్ ఫాలోయింగ్ ను తట్టుకొలేక, ఎపి లో కనీస గుర్తింపు ను నిలబెట్టుకొలేక, తాజాగా బద్వేల్ ఎన్నికలలో కూడా బిజెపి బోల్తా కొట్టింది. మరీ కేంద్ర పెద్దలు ,కనీసం ఇప్పడయినా సోమరి సోము మీద వేటు వెస్తారా, పార్టీ కి ఎపి జీవం పోస్తారా లేదో చూడాలి..

టిఆర్ఎస్ కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుందా..

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

డ్రాగన్ ఫ్రూట్ తో ఇన్ని లాభాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -