Thursday, May 16, 2024
- Advertisement -

ఆత్మాభిమానం దెబ్బ‌తిన్నందుకే టీడీపీలో చేరా… చిల‌క‌ప‌లుకులు..

- Advertisement -

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి ప‌చ్చ‌కండువా క‌ప్పుకొని సైకిలెక్కేశారు. అంతే ఇంకేముందు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు మొద‌లెట్టేసింది. నా ఆత్మాభిమానం వైసీపీలో దెబ్బతిన్నది’’ ఇది పార్టీ ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు. సోమవారం ఉదయం ఆమె టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు సమక్షంఆ లో ఆ పార్టీలో చేరారు. టీడీపీ పార్టీ కండువా కప్పి.. ఆమెను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వైసీపీలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం, గిరిజనుల సంక్షేమం కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తాను పడిన శ్రమను వైసీపీ అధినేత జగన్ గుర్తించలేదని వాపోయారు. హుద్ హుద్ తుఫాను తర్వాత విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతోగానో కృషి చేశారన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు ఆమె ప్రకటించారు.

ఈశ్వరితోపాటు 60మంది ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు కూడా టీడీపీలోకి చేరారు. ఈశ్వరితో కలిసి ఇప్పటి వరకు 23మంది ఎమ్మెల్యేలు , ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇదిలా ఉండగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబు కూడా నీతి వంత‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని…. అందుకే అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత, రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధికి సహకరించాలని పదేపదే పిలుపునిచ్చిన తనకు, మంచి స్పందన వచ్చిందని, తనతో దూరంగా ఉన్నవారు దగ్గరవుతున్నారని చెప్పారు. తనకు సహకరించేందుకు మరింత మంది విపక్ష నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -