Saturday, May 18, 2024
- Advertisement -

అది జ‌రిగితె రాష్ట్రం వ‌దిలి వెల్తా…..

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ఉన్నా అప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. వ‌ల‌స‌లు,జంపింగ్ జిలానీల‌కోసం పార్టీలు వేట‌ను కొన‌సాగిస్తున్నాయి. వీటికి తోడు నాయ‌కుల మ‌ధ్య స‌వాల్లు, ప్ర‌తి స‌వాల్లు మొద‌ల‌య్యాయి. గుడివాడ నియేజ‌క వ‌ర్గంలో టీడీపీ, వైసీపీ పాయుకుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒక‌రి మీద ఒక‌రు స‌వాల్లు విసురుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. న‌న్ను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఓడించే ద‌మ్ము టీడీపీకి ఉందాని స‌వాల్ విసిరారు. సవాల్‌ను స్వీకరించే దమ్మున్న టిడిపి నేత ముందుకు రావాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాష్ట్ర పార్టీని, డబ్బును దింపి తనను ఓడించే సత్తా ఎవరికీ లేదన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో 10వేల మంది యువతతో జగన్ యువసేనను నిర్మిస్తానన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు చేయడం కన్నా.. వాటిపై దర్యాప్తు ఎందుకు జరిపించలేక పోతున్నారని వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ ప్రశ్నించారు.

గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్ రావి వెంక‌టేశ్వ‌రావుకూడా నానిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వలివర్తిపాడు ప్రాంతంలో ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బినామీ పేర్లతో ఆక్రమించారని త్వ‌ర‌లోనె జైలుకెల్ల‌డం ఖాయ‌మ‌న్నారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఇంకా ఉన్నా నియేజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం రాజ‌కీయం వెడెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -