Monday, May 20, 2024
- Advertisement -

ప‌శ్చిమ‌లో జ‌న ప్ర‌భంజ‌న‌ను చూసి త‌ట్టుకోలేక‌పోతున్న టీడీపీ

- Advertisement -

జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద యాత్ర ఆంధ్ర రాజ‌కీయాల్లో పెనుసంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న‌తో అధికార పార్టీ గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేప‌ట్టాలంటే గోదావ‌రి జిల్లాల్లో వ‌చ్చే సీట్ల‌పైనే ఆధార‌ప‌డింద‌నేది తెలిసిందే. ఇటీవ‌లే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన పాద‌యాత్ర 2000 కి.మీ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ జగన్ కి వస్తున్న ఆదరణను చూస్తుంటే కచ్చితంగా రాబోయే ఎన్నికలలో..చాలా మెజార్టీ స్థానాలు వైసీపీ కైవ‌సం చేసుకుంటుంద‌న‌డంలో సందేహంలేదు. గత ఎన్నికలలో ఈ జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలవని వైసిపి ఈసారి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు.

సస్యశ్యామలంగా పంటపొలాలతో శాంతి వాతావరణంతో నిండుకొని ఉంటుంది. కానీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ గోదావరి జిల్లా లో ఇప్పటి వరకు 7 హత్యలు పట్టపగలు నడిరోడ్డు మీద జరగడం చూస్తే బాబు పాల‌న ఎలాఉందో అర్థం చేసుకోవ‌చ్చు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ఇంటికి పంపించాలి అనుకుంటున్నారు పశ్చిమ వాసులు.

జగన్ చేస్తున్న పాదయాత్రలో ఎక్కువగా చంద్రబాబు చేతిలో ఏ విధంగా మోసపోయారో జిల్లావాసులు తమ బాధను వెళ్ళబుచ్చుతున్నారు..గత ఎన్నికలలో జిల్లాను అభివృద్ధి చేస్తారని మెజారిటీ స్థానాలు అందజేస్తే ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని వాపోతున్నారు ప్ర‌జ‌లు.

దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని చేస్తున్న ఆరాచ‌కాల‌ను జ‌గ‌న్‌తో ఏక‌రువు పెట్టారు ప్ర‌జ‌లు. దీనిపై కూడా అక్క‌డి ప్ర‌జ‌లుకు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇటువంటి నాయకులను కచ్చితంగా జైల్లో చిప్పకూడు తినిపిస్తానని…హెచ్చ‌రించారు. అక్ర‌మార్కులు స్వాధీనం చేసుక‌న్న భూముల‌ను తిరిగి వారికే ఇస్తామ‌ని జ‌గ‌ణ్ హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -