Thursday, May 16, 2024
- Advertisement -

సీఎం సొంత జిల్లాలో జ‌గ‌న్‌కు బ్ర‌హ్మార‌థం

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ధృడ సంక‌ల్పంతో తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా పాద‌యాత్ర చేసుకుంటూ పోతున్నాడు. త‌న తండ్రి మాదిరి త‌న‌కు పాద‌యాత్ర‌తో రాజ‌యోగం ద‌క్కుతుంద‌నే ఆశ‌తో భారీ ల‌క్ష్యం నిర్దేశించుకుని ప్ర‌జా సంక‌ల్ప యాత్రగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాద‌యాత్ర‌గా వెళ్తున్నాడు. ఇప్ప‌టికే సీమ ప్రాంతం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. వైఎస్సార్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం పాద‌యాత్ర పూర్తి చేసుకొని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో అడుగుపెట్టాడు. అయితే ఆ జిల్లాలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మార‌థం ప‌ట్టారు. ఎప్పుడూ లేనివిధంగా చంద్ర‌బాబుకు రానంత ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌చ్చారు.

జ‌గ‌న్‌కు నీరాజ‌నాలు ప‌లుకుతూ ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఇది చూస్తే చంద్ర‌బాబుకు వ‌ణుకుప‌ట్టే మాదిరి జ‌నాలు అడుగుపెట్టారు. నిర్విరామంగా సాగుతున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 47 రోజుల్ని పూర్తి చేసుకుని చిత్తూరు జిల్లాలో అడుగుపెట్ట‌డం అధికార పార్టీలో అల‌జ‌డి రేగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివ‌చ్చారు. ప్ర‌భుత్వ పాల‌న‌పై ఎప్పుడూ విమ‌ర్శిస్తూ తాను అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తాన‌నో చెబుతూ పాద‌యాత్ర సాగిస్తున్నాడు.

అలుపెర‌గ‌ని పాద‌యాత్ర‌తో ఆయ‌న‌కు తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మాదిరిగా రాజ‌యోగం ద‌క్కే అవ‌కాశం ఉందో లేదో చూడాలి. ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉన్న తంబళ్ల పల్లివాసులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తే మేలు జరుగుతుందని స్థానిక స‌మ‌స్య‌ను గుర్తుచేశాడు. దీంత ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. ఈ విధంగా స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ త‌న‌కు తోచిన విధంగా పాద‌యాత్ర కొన‌సాగిస్తూ వెళ్తున్నాడు. తన తండ్రి వైఎస్సార్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశారని.. మిగిలిన 20 శాతం పనుల్ని గడిచిన నాలుగేళ్లలో బాబు ప్రభుత్వం పూర్తి చేయలేదని విమ‌ర్శించి చుర‌క‌లంటిచారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే హంద్రీనీవా ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసి.. ప్రతి చెరువుకూ నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -