Thursday, May 16, 2024
- Advertisement -

మ‌హా కూట‌మిలో కొర‌క‌రాని కొయ్య‌గా మారిన కోదండ రామ్‌..

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల వేడి తారాస్తాయికి చేరింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు అభ్య‌ర్త‌ల ఎంపిక‌లో బిజీగా ఉంటే అధికార పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతోంది. అధికారం కోసం వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాల‌తో పార్టీల‌న్నీ నిమ‌గ్న‌మైఉన్నాయి. ఎవిధంగా నైనా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని ప్ర‌తి ప‌క్ష‌పార్టీలు కంక‌ణం క‌ట్టుకున్నాయి. టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీలు, ప్ర‌జా సంఘాలు అన్ని ఒక తాటిపైకి వ‌చ్చేందుకు పావులు క‌దుపుతున్నారు.

కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే ఒంట‌రిగా పోటీ చేస్తే ఫ‌లితం ఉండ‌ద‌ని భావించిన కాంగ్రెస్ , టీడీపీ, కోదండ రామ్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ టీజేఎస్ ఇత‌ర సారుప్య‌త పార్టీల‌తో మ‌హాకూట‌మి ఏర్పాటు చేశారు. అయితే సీట్ల పంప‌కంలో కోదంరాం మ‌హాకూట‌మికి కొర‌క‌రాని కొయ్య‌లా మారార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే సీట్ల విష‌యం ఓ కొలిక్కి రాలేద‌ని తెలుస్తోంది.

కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు చేసి దానికి తనను చైర్మన్ ను చేయాలని.. అలాగే 30 వరకూ టీజేఎస్ కు సీట్లు కావాలని మొండిపట్టు పడుతున్నాడని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. టీజేఎస్‌కే అన్ని సట్లు కేటాయిస్తే మిగిత పార్టీల సంగ‌తి ఏంట‌ని కాంగ్రెస్ మ‌ద‌న‌ప‌డుతోంది.

ఇద‌లా ఉంటే కోదండ పోటీచేసి స్థానం పేరు చెబితే అభ్యర్థులను సర్దుబాటు చేసుకుందామని కాంగ్రెస్ కోరుతున్నా ఆయన మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క పోవ‌డంతో మ‌హాకూట‌మి గంద‌ర‌గోలంగా త‌యార‌య్యింది. కోదండరాం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్ర‌త్యేక తెలంగాణా ఉద్య‌మ సెంటీమెంట్ బ‌లంగా ఉన్న ప్రాంతం, అంతే కాకుండా ఉస్మానియా యూనివ‌ర్షిటీ కూడా ఆ నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో ఉండ‌టం, ఫ్రొఫెస‌ర్‌గా కోదండ‌రామ్ ప‌నిచేయ‌డం లాంటి అంశాలు ఆయ‌న గెలుపుకు అనుకూలంగా ఉండ‌నున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నారు. మ‌రో వైపు టీడీపీ కూడా ఎక్క‌వ సీట్లు కోర‌డంతో సీట్ల పంప‌కాల విష‌యంలో ఇప్పుడే క్లారిటీ వ‌చ్చేట‌ల్లు క‌నిపించ‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -