Thursday, May 9, 2024
- Advertisement -

కన్ఫామ్…పెద్దల సభకు కోదండరాం?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో శరవేగంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. ప్రజల్లో ఆ పార్టీ పట్ల కొంత సానుభూతి ఉండగా దానిని క్యాచ్ చేసుకునేందుకు అవసరమైన రాజకీయ ఎత్తుగడలన్నింటిని ఉపయోగిస్తోంది. ఓ వైపు చేరికలు మరోవైపు కేసీఆర్‌ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తేవడంలో పైచేయి సాధించిందనే చెప్పాలి. ఇందులో భాగంగా ఇప్పటికే షర్మిల పార్టీని పోటీ నుండి దూరం చేయడంలో సక్సెస్ అయిన హస్తం నేతలు కోదండరామ్‌తో చర్చలు సఫలం చేశారు. దీంతో అప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కోదండరాం వెనక్కి తగ్గారు.

పోటీ నుండి తప్పుకోవడం కోసం కోదండరాం పార్టీకి రాజ్యసభ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీలు, ఐదు కార్పోరేషన్ పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక గత ఎన్నికల్లో తెలంగాణ జన సమితి తరపున అభ్యర్థులు పోటీ చేసినా కోదండరాం మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన పెద్దల సభకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.దీంతో చట్టసభల్లో తన వాయిస్ వినిపించవచ్చని భావిస్తున్నారు. ఒప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి టీజేఎస్ అంగీకరించినట్లు తెలిసింది.

అయితే పదవులన్నింటిపై రాష్ట్ర నాయకత్వంతో కాకుండా కాంగ్రెస్ అధినాయకత్వంతోనే చర్చలు జరిగినట్లు టీజేఎస్ నేతలు చెబుతున్నారు. ఏదిఏమైనా తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కోదండరాంకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్టసభల్లోకి వెళ్లాలనే కోరిక నెరవేరనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -