Thursday, May 16, 2024
- Advertisement -

మాజీ మంత్రి చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన జ‌గ‌న్‌..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది రాజ‌కీయ పార్టీలు త‌మ కార్య‌క‌లాపాల‌ను స్పీడు పెంచాయి. ఇత‌ర పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకొనేందుకు ఆస‌క్తి చేపుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పుణ్య‌మాని వైసీపీ బ‌ల‌ప‌డుతోంది. పొత్తును వ్య‌తిరేకిస్తున్నా నేత‌లు కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి ప్ర‌త్యామ్నాయంగా ఫ్యాన్ కింద‌కు చేరుకుంటున్నారు.

పొత్తును వ్య‌తిరేకించి కాంగ్రెస్ మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత కుమార్ చేరిక లాంఛ‌న‌మే. గ‌త కొన్ని రోజులుగా పార్టీలో చేరుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బెర్త్ కన్ఫమ్ కాక పోవ‌డంతో చేరిక వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. వైఎస్ జ‌గ‌న్ బెర్త్‌ను క‌ల‌న్ఫ‌మ్ చేయ‌డంతో ఆయ‌న చేరిక ఇక లాంఛనమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అభ్య‌ర్తుల ఎంపిక‌కు సంబంధించి జ‌గ‌న్ స‌మాచారాన్ని తెప్పించుకున్న సంగ‌తి తెలిసిందే. స‌ర్వేలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రస్తుత సమన్వయ కర్త కర్త కొట్టు సత్యనారాయణకు ప్ర‌తికూల పరిస్థితులు ఎదురవుతున్నాయంట‌. అందుకే ఆయ‌న స్థానాన్ని వట్టి వసంతకుమార్ కు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదే సీటుపై కొట్టు సత్యనారాయణ‌తో పాటు వలవల బాబ్జీ కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. వీరిద్ద‌రిని కాద‌ని జ‌గ‌న్ వ‌ట్టికే సీటు కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారంట‌. అయితే ప్ర‌స్తుత ఇన్‌చార్జ్ సత్యనారాయణ‌కు వైవి సుబ్బారెడ్డి మాత్రం కొట్టు సత్యనారాయణ వైపే మెుగ్గు చూపుతున్నారంట‌.

గతంలో వట్టి వసంత్ కుమార్ నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అందుకు వైఎస్ జగన్ అంగీకరించకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూడటం మానేశారు. తాజాగా తాడేపల్లిగూడెం బరిలో నిలపాలని ఆ పార్టీ భావిస్తోంది.

గ‌తంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా మెలిగిన ఐఏఎస్‌ అధికారి భానుమూర్తి కూడా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చెయ్యాలని భావించారు. ఆ తర్వాత సినీనటుడు పృథ్వీరాజ్‌ కూడా తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మాజీమంత్రిగా జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న వట్టి వసంతకుమార్ బరిలో నిలిస్తే గెలిచే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -