Saturday, May 18, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై అసంతృప్తిగా ఉన్న నేత‌లు…

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని చెప్పిన ప‌వ‌న్ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్ని సీట్ల‌లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకీ మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ త‌ర్వాత ప‌క్క‌కు ప‌వ‌న్ ఆత‌ర్వాత బాబు, లేకేష్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే జ‌న‌సేన పార్టీలో చీల‌క‌లు మొద‌ల‌య్యాయ‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

నిన్న మొన్నటిదాకా బాగానే ఉన్న పార్టీ నేతల్లో ఒక్కసారిగా చీలికలు మొదలయ్యాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీంతో పార్టీలో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. అందుకు కారణం ప్రజారాజ్యం అనే వాద‌న వినిపిస్తోంది.

అస‌లు విష‌యానికి వ‌స్తే ఇటీవల పవన్.. పార్టీలో ఏడు జిల్లాలకు కన్వీనర్లను నియమించిన సంగ‌తి తెల‌సిందే. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రటించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో బాధ్యులను ప్రకటించనున్నారు.

అయితే పార్టీ పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారట. మొద‌టినుంచి పార్టీకీ సేవ‌లు అందిస్తున్నా చివ‌ర‌కు త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో క్రియాశీల‌కంగా ప‌నిచేస్తున్నాతమను కాదని కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు పదవులు దక్కాయని జనసైనికులు ఆవేదన చెందుతున్నారట.

గత నాలుగేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరించిన వారికంటే ప్రజారాజ్యంలో పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కులాల ప్రస్తావన లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్తోన్న పవన్‌కల్యాణ్ ఒకే సామాజికవర్గానికి చెందినవారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకూ ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన 80 శాతం మందికి పదవులు దక్కాయట. కులాల ప్రస్తావన లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్తోన్న పవన్ ప‌ద‌వులు మాత్రం త‌మ సామాజిక వ‌ర్గానే ఇస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -